క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-06-30T12:59:53+05:30 IST

క్షయ వ్యాధి రహిత తమిళనాడుగా రూపొందించేందుకు రాష్ట్రంలో 23 మొబైల్‌ ఎక్స్‌రే వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభిస్తారని ఆరోగ్య

క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

- నేడు 23 మొబైల్‌ ఎక్స్‌రే వాహనాలు ప్రారంభం

- ఆరోగ్య మంత్రి వెల్లడి 


అడయార్‌(చెన్నై), జూన్‌ 29: క్షయ వ్యాధి రహిత తమిళనాడుగా రూపొందించేందుకు రాష్ట్రంలో 23 మొబైల్‌ ఎక్స్‌రే వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభిస్తారని ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం నొచ్చికుప్పం నుంచి ఈ వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. చెన్నై నగరంలో కరోనా వైరస్‌ క్రమంగా వ్యాపిస్తోందని, ఇప్పటికే వీధికి ముగ్గురు చొప్పున 300 వీధుల్లో ఈ వైరస్‌ సోకిందని మంత్రి వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మైలాపూరులోని లజ్‌ కార్నర్‌లో 50 వేల మాస్కులు, కరపత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఇందులో నగర మేయర్‌ ఆర్‌.ప్రియతో కలిసి మంత్రి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గణాంకాల ప్రకారం 8970 మంది కొవిడ్‌ బాధితులు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. వీరిలో కేవలం 5 శాతం మంది మాత్రమే ఆస్పత్రిల్లో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే మాస్క్‌ విధిగా ధరించాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్రాన్ని క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి ఎలాంటి అడ్డంకి లేదని, కానీ, కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ సమావేశం నిర్వహించుకోవచ్చన్నారు. 

Updated Date - 2022-06-30T12:59:53+05:30 IST