Covid చికిత్సలకు రూ. 779 కోట్లు

ABN , First Publish Date - 2022-07-01T16:39:00+05:30 IST

‘ఆయుష్మాన్‌’ భారత ఆరోగ్య కర్ణాటక పథకంలో భాగంగా 2.39 లక్షల మంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించిన ప్రైవైట్‌ ఆసుపత్రులకు రూ779.83

Covid చికిత్సలకు రూ. 779 కోట్లు

                        - ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లింపు: మంత్రి సుధాకర్‌


బెంగళూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘ఆయుష్మాన్‌’ భారత ఆరోగ్య కర్ణాటక పథకంలో భాగంగా 2.39 లక్షల మంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించిన ప్రైవైట్‌ ఆసుపత్రులకు రూ779.83 కోట్లను చెల్లించారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్‌ కె. సుధాకర్‌ నగరంలో గురువారం మీడియాకు వెల్లడించారు. సువర్ణ ఆరోగ్య సురక్షా ట్రస్టు ద్వారా ఈ చెల్లింపులు చేశామన్నారు. కొవిడ్‌ తొలివేవ్‌లో 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు ఈ పధకం ద్వారా 1,17,930 మంది కొవిడ్‌ బాధితులు పలు ప్రైవైట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. తొలి వేవ్‌  సమయంలో ప్రైవై ట్‌ ఆసుపత్రులకు ట్రస్టు ద్వారా రూ 391.26 కోట్లు చెల్లించారు. ఇక కొవిడ్‌ రెండో వేవ్‌  సమయం లో 2021 ఏప్రిల్‌ నుండి డిసెంబరు వరకు 1,14,890 మంది కొవిడ్‌ బాధితులకు చికిత్సను అందించిన ప్రైవైట్‌ ఆసుపత్రులకు రూ. 376.76 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. ఇక ప్రస్తుత ఏడాది మూడోవేవ్‌ వేళ ఏప్రిల్‌ నుండి ఇంతవరకు 653 మంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించిన ప్రయివేటు ఆసుపత్రులకు రూ 2.83 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. కొవిడ్‌ వేళ అక్రమాలు అవినీతి జరిగిందంటూ గొంతుచించుకునే ప్రతిపక్ష నేతలకు తమ ప్రభుత్వ చిత్తశుద్ది అర్ధం కావడం లేదన్నారు. కొవిడ్‌ బాధితుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందనడానికి ఈ గణాంక వివరాలే తిరుగులేని తార్కాణమన్నారు.

Updated Date - 2022-07-01T16:39:00+05:30 IST