కరోనా రాకుండా ‘మంత్ర కషాయం’ తీసుకున్న మంత్రి పాజిటివ్.. నవ్వుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-01-25T09:57:51+05:30 IST

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఓ మంత్ర కషాయం తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి.. తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ వింత ఘటన మన పొరుగు దేశం శ్రీలంకలో వెలుగు చూసింది. ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి పవిత్ర వానియరాచ్చి..

కరోనా రాకుండా ‘మంత్ర కషాయం’ తీసుకున్న మంత్రి పాజిటివ్.. నవ్వుతున్న నెటిజన్లు!

కొలంబో: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఓ మంత్ర కషాయం తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి.. తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ వింత ఘటన మన పొరుగు దేశం శ్రీలంకలో వెలుగు చూసింది. ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి పవిత్ర వానియరాచ్చి.. ఇటీవలే కరోనాతో పోరాడేందుకు ఓ ‘మ్యాజిక్ సిరప్’ (మహిమగల మంత్ర కషాయం) తీసుకున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఓ మంత్రి.. ఇలాంటి పిచ్చి పనులను ప్రోత్సహించడం ఏంటని చాలా మంది ప్రశ్నించారు.


పవిత్రతోపాటు చాలా మంది ప్రభుత్వ అధికారులు ఈ మంత్ర కషాయం తీసుకున్నారు. దీంతో ప్రజలు ఈ కషాయం కోసం ఎగబడ్డారు. ఇది లభించే కగల్లె టౌన్‌లో వేలసంఖ్యలో గుమిగూడారు. ఇదంతా గతేడాది డిసెంబరులో జరిగింది. అయితే తాజాగా పవిత్రకు కరోనా సోకినట్లు వెల్లడైంది. ఇటీవల ఆమెకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో తనను ఇటీవలి కాలంలో కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆమె కోరింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ‘మంత్ర కషాయం పనిచేయలేదా?’ అంటూ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.

Updated Date - 2021-01-25T09:57:51+05:30 IST