త్వరలో హెల్త్‌ ప్రొఫైల్‌

Jun 17 2021 @ 01:06AM
టీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతోందని, ఇందులో మోడల్‌ జిల్లాలుగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను ఎంపిక చేసిందని పుర పాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం సిరి సిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారం భించారు. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లోని పరికరాలను పరిశీలించారు. డయాగ్నోస్టిక్‌ సెంట ర్‌కు కావాల్సిన సిబ్బంది, ఇతర అవసరాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొం దించడానికి ప్రణాళికలను తయారు చేసుకోవాలని, ఇందుకు జిల్లా ఆదర్శంగా నిలవాలని అన్నారు. నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. జిల్లాలో కరోనా పరిస్థితిని తెలుసుకున్నారు. సిరిసిల్లలో రూ2.20 కోట్లతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ అతిధి గృహానికి రోడ్లు, భవన నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు  బోయినపల్లి వినోద్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ,   కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, న్యాప్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంక రయ్య, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్‌, దార్నం లక్ష్మీనారాయణ, మంచె శ్రీనివాస్‌, అగ్గిరాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: