ఆరోగ్య సర్వే..అంతంతగానే..

ABN , First Publish Date - 2021-05-11T05:18:30+05:30 IST

ఇంట్లో ఉంటున్న వారికి కరోనా లక్షణాలు ఉంటే వారిని గుర్తించి, కొవిడ్‌ కిట్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చే పడుతుంది.

ఆరోగ్య సర్వే..అంతంతగానే..
మల్‌రెడ్డిపల్లిలో పర్యటిస్తున్న కలెక్టర్‌ హరిచందన (ఫైల్‌)

- 1,957 మంది కరోనా బాధితులకు కిట్ల పంపిణీ

- సర్వే నత్తనడనక సాగుతుండటంపై ప్రజల్లో అసంతృప్తి


నారాయణపేట, మే 10 : ఇంట్లో ఉంటున్న వారికి కరోనా లక్షణాలు ఉంటే వారిని గుర్తించి, కొవిడ్‌ కిట్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చే పడుతుంది. ఇందులో భాగంగా ఈ నె ల 7వ తేదీ నుంచి జిల్లాలో ఈ కార్య క్రమాన్ని వైద్యాధికారి చంద్రమోహన్‌, డీఐవో శైలజ, సర్వే అధికారి సిద్ధప్ప ఆధ్వర్యంలో ఆశ, అంగన్‌వాడీ, ఏఎ న్‌ఎంలు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ కార్యక్రమంలో జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. జిల్లాలో 1.11 లక్షల నివాసాలు ఉన్నాయి. జిల్లాలో ఆశ వర్కర్లు 591, అంగన్‌వాడీ కార్యకర్తలు 704, ఏఎ న్‌ఎంలు 117 మంది ఉండగా, సర్వే కోసం 640 బృందాలను ఏర్పాటు చే శారు. ఒక్కొక్క బృందంలో ఆశ, అంగ న్‌వాడీలతో పాటు ఐదు వేల జనా భాకు ఒక ఏఎన్‌ఎం కూడా సర్వేలో పాల్గొంటుంది. జిల్లాలో గ్రామీణ ప్రాం తాల సర్వే కోసం 567 బృందాలు, జి ల్లాలోని కోస్గి, మక్తల్‌, నారాయణపేట మునిసిపాలిటీ పరిధిలో 77 బృందా లు సర్వే చేస్తున్నాయి. జిల్లాలో ఇప్ప టి వరకు 87,743 కుటుంబాలకు సర్వే నిర్వహించగా, 1,957 మందికి కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో వారికి మందు ల కిట్లను అందించి ఇంట్లోనే ఐసోలేష న్‌ ఉండాలని సర్వే సిబ్బంది సూచిస్తు న్నారు. సర్వేకు సంబందించి గ్రామీణ ప్రాంతాల్లో 75,487 కుటుంబాలకు స ర్వే చేయగా 1,666 మందికి కొవిడ్‌ ల క్షణాలు ఉండటంతో చికిత్సలు అందిం చారు. జిల్లాలోని మూడు మునిసిపా లిటీల పరిధిలో 12,256 కుటుంబాల కు సర్వే చేయగా, 291 మందికి లక్ష ణాలు ఉండటంతో వారికి కరోనా కిట్లను అందించారు. జిల్లాలో కొనసాగు తున్న సర్వేను తాజాగా జిల్లా కలెక్టర్‌ హరిచందన దామరగిద్ద మండలం మల్‌రెడ్డిపల్లి గ్రామంలో పరిశీలించా రు. కాగా, జిల్లాలో సర్వే నత్తనడకన కొనసాగుతుండటంతో వేగవంతం చే సేలా జిల్లా అదికార యంత్రాంగం దృ ష్టిని కేంద్రీకరించాల్సి ఉన్నది.

Updated Date - 2021-05-11T05:18:30+05:30 IST