హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-10-02T05:07:17+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరునే కొనసాగించాలని మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌ శ్రీనాథ్‌ గౌడు, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌ పవన్‌కుమార్‌ గౌడు పేర్కొన్నారు.

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలి

రిలే దీక్షలో టీడీపీ నాయకులు

గుంతకల్లు, అక్టోబరు 1: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరునే కొనసాగించాలని మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌ శ్రీనాథ్‌ గౌడు, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌ పవన్‌కుమార్‌ గౌడు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నాయకులు రిలే దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనాథ్‌గౌడు మాట్లాడుతూ ఇన్నా ళ్లు ఏ ప్రభుత్వం ఇటువంటి తుగ్లక్‌ పనులకు ఒడిగట్టలేదన్నారు. రాష్ట్రా న్ని సమర్థవంతంగా పరిపాలించ వలసిన జగన్‌, ఆ విషయాన్ని పక్క నపెట్టి వివాదాలను సృష్టిస్తూ రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్నాడన్నారు. అధికారం చేపట్టిన రోజు నుంచి అప్పులు చేయడం తప్ప మరొక అభివృద్ధి చేసిందిలేదన్నారు. ఆదర్శ రాజకీయ నాయకుడిగా, ప్రజల ఆరాధ్య దైవంగా మన్ననలందుకున్న ఎన్టీఆర్‌ పేరును తొలగించడంపై యావత్‌ రాష్ట్ర ప్రజలు నిరసిస్తున్నారన్నారు. పవన్‌కుమార్‌ గౌడు మాట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరేను కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి జగన్మోహన్‌ రెడ్డి తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తొలిరోజు రిలేదీక్షలను   పవన్‌కు మార్‌, పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వెంక టేశులు, బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు టీ కేశప్ప, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తలారి మస్తానప్ప, తెలుగు యువత పాయకుడు వాల్మీకి రాము, నాయకులు కురుబ సురేశ్‌, నందీశ్వర్‌, ఫ్రూట్‌ మస్తాన్‌, గిడ్డయ్య, బీకే మధు, వెంకటేశులు, ఈశ్వర్‌, ఓబన్న, మీఠూ నాయక్‌, రాముడు చేప ట్టారు. కార్యక్రమంలో టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ కృష్ణా రెడ్డి, పార్టీ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన్‌ యా దవ్‌, హనుమంతు, చికెన్‌ జగన్‌, బండారు రామన్న చౌదరి, లక్ష్మయ్య యాదవ్‌, కే శివన్న, ఆటోఖాజా, ఫజులు, నరసింహులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-02T05:07:17+05:30 IST