ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2022-09-28T06:45:44+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలని టీడీ పీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలి
ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ జారీ చేసిన జీవోను దగ్ధం చేస్తున్న టీడీపీ నేతలు

వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీకి వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 

అడ్డుకుని కార్యాలయానికే పరిమితం చేసిన పోలీసులు

జీవోలను ప్రతులను దహనం చేసిన టీడీపీ శ్రేణులు

విద్యాధరపురం, సెప్టెంబరు 27 : ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలని టీడీ పీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. తూర్పు ని యోజకవర్గం ఏపీఐఐసీ కాలనీ, గుణదల గంగిరెద్దుల దిబ్బలో మంగళవారం వైఎ్‌సఆర్‌ అర్బన్‌ క్లినిక్‌లను వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రారంభించా రు. ఏపీఐఐసీ కాలనీ టీడీపీ కార్యాలయానికి దగ్గరగా ఉండడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని టీడీపీ జిల్లా కార్యాలయంలో నే నిర్బంధించారు. ఎవరినీ బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రజనీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ ఇచ్చిన జీవో కాపీలను దహనం చేశారు. కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్‌, పొట్లూరి సాయిబాబు, దేవినేని అపర్ణ, గొల్లపూడి నాగేశ్వరరావు, అబ్దుల్‌ రషీద్‌, దేవరపల్లి ఆంజనేయులు, ఎంఏ ఖాలిక్‌, కర్రె ఉమామహేశ్వరి, నాగమణి, బేబీ, దుర్గ పాల్గొన్నారు.

పేదవారికి కార్పొరేట్‌ వైద్యం : మంత్రి రజనీ 

పటమట : పేదవారికి కార్పొరేట్‌ వైద్యసేవలందించటమే ముఖ్య లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో వైఎ్‌సఆర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజనీ అన్నారు. వైసీపీ తూర్పు ఇన్‌చార్జి దే వినేని అవినా్‌షతో కలిసి మంగళవారం 11వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీ, 5వ డివిజన్‌ గంగిరెద్దుల దిబ్బ కొం డ ప్రాంతంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎ స్‌ఆర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్లను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ వైద్యరంగలో అభివృద్ధికి బాటలు వేసింది వైఎ్‌సరాజశేఖర్‌రెడ్డి అని, ఆయన త నయుడు జగన్‌ అంతకు మించి కృషి చేస్తున్నారన్నారు. ఆర్థిక కారణాలతో ఏ ఒక్క పేదవాడికి వైద్యం దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆ రోగ్యశ్రీ పరిధిని పెంచారని ఆమె గుర్తు చేశారు. అవినాష్‌ మాట్లాడుతూ ఏపీలోని ఆరోగ్యశ్రీని పక్క రాష్ర్టా లు అమలు చేయడం విశేషమన్నారు. కలెక్టర్‌ ఎస్‌. దిల్లీరావు, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని, మేయర్‌ రాయన భాగ్యల క్ష్మి, ఫ్లోర్‌ లీడర్‌ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మే యర్‌లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T06:45:44+05:30 IST