ఆరేళ్ల బాబు ఎత్తు, బరువు, ఎదుగుదల తగినంతగా లేదనిపిస్తోంది.. పరిష్కారం ఏమిటి?

ABN , First Publish Date - 2022-04-22T20:46:22+05:30 IST

మా బాబుకు ఆరేళ్ళు. ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉంటాడు కానీ ఎత్తు, బరువు, ఎదుగుదల తగినంతగా లేదనిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం సూచించండి.

ఆరేళ్ల బాబు ఎత్తు, బరువు, ఎదుగుదల తగినంతగా లేదనిపిస్తోంది.. పరిష్కారం ఏమిటి?

ఆంధ్రజ్యోతి(22-04-2022)

ప్రశ్న: మా బాబుకు ఆరేళ్ళు. ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉంటాడు కానీ ఎత్తు, బరువు, ఎదుగుదల తగినంతగా లేదనిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం సూచించండి.


- వెంకట రమణ, తిరుపతి  


డాక్టర్ సమాధానం: పిల్లల ఎదుగుదల సవ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం అత్యవసరం. చిన్నతనం నుండి పిల్లలకు చేసే ఆహారపు అలవాట్ల వల్ల వారు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు, మొదలైనవి పొడి చేసి పిండిలో కలిపి చపాతీ, పరాఠాల వంటివి చేసి ఇవ్వవచ్చు. పాలల్లో శక్తినిచ్చే పొడులు కలపండి . ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు కూడా పెట్టవచ్చు. ఆకలి సరిగా లేకపోవడం వల్ల తినడం లేదని అనిపిస్తే వైద్యుల సలహా మేరకు మందులు వాడడం మంచిది. భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు లాంటివి పెట్టకూడదు. ఇంట్లో తయారు చేసిన నువ్వులు, బెల్లం ఉండలు, మినప సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు మొదలైనవి రోజులో ఓసారి ఇవ్వండి. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి గ్రైండ్‌ చేసి మిల్క్‌ షేక్‌ లాగ ఇవ్వడం ద్వారా బరువు పెరిగేందుకు అవసరమైన క్యాలరీలను అందించవచ్చు. ఆకలి సరిగా వేసేందుకు, తిన్న ఆహారం సక్రమంగా వంటబట్టేందుకు రోజుకు కనీసం రెండుగంటలైనా ఆటలాడించడం మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2022-04-22T20:46:22+05:30 IST