హెల్దీ ఓట్స్‌ అండ్‌ నట్స్‌ కుల్ఫీ

ABN , First Publish Date - 2021-03-22T17:39:39+05:30 IST

మదుమేహులు కూడా ఎంజాయ్‌ చేసే కుల్ఫీ ఇది. పెద్ద, చిన్నా అందరూ ఇష్టపడే సమ్మర్‌ డ్రింక్‌ ఇది. ఇందులో వాడే ఓట్స్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరగరు. ఇక నట్స్‌ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఈ కుల్ఫీని ఎలా చేయాలంటే...

హెల్దీ ఓట్స్‌ అండ్‌ నట్స్‌ కుల్ఫీ

మదుమేహులు కూడా ఎంజాయ్‌ చేసే కుల్ఫీ ఇది. పెద్ద, చిన్నా అందరూ ఇష్టపడే సమ్మర్‌ డ్రింక్‌ ఇది. ఇందులో వాడే ఓట్స్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరగరు. ఇక నట్స్‌ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఈ కుల్ఫీని ఎలా చేయాలంటే...


కావలసిన పదార్థాలు: ప్లెయిన్‌ ఓట్స్‌ - నాలుగు టేబుల్‌స్పూన్లు, పాలు - రెండు కప్పులు,  బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, తేనె - రెండు టేబుల్‌స్పూన్లు, మెత్తటి కొబ్బరి - ఒక టేబుల్‌స్పూన్‌, రోజ్‌వాటర్‌ - టీస్పూన్‌, యాలకులు-ఒకటి, కుంకుమపువ్వు - కొద్దిగా, డ్రైఫ్రూట్స్‌ ముక్కలు (బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, జీడిపప్పుల మిశ్రమం) - రెండు టేబుల్‌స్పూన్లు, ఐస్‌క్రీమ్‌పుల్లలు.


తయారీ: ఓట్స్‌, కొబ్బరి, యాలకులను తీసుకుని బ్లెండర్‌తో  మెత్తగా పొడిచేసి ఒక గిన్నెలో పోయాలి. డ్రైఫ్రూట్స్‌ అన్నింటినీ కలిపి కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. మరో బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్‌స్పూన్ల పాలు పోసి అందులో కుంకుమపువ్వు రెబ్బలను నానబెట్టాలి. కడాయి తీసుకుని దాన్ని స్టవ్‌ మీద సన్నని మంటపై పెట్టి మిగిలిన పాలను అందులో పోయాలి. ఆ పాలల్లో ఓట్స్‌ మిశ్రమం, డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం వేసి ఆ పొడి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఒకటి రెండు నిమిషాల తర్వాత రెడీగా పెట్టుకున్న బెల్లాన్ని, తేనెను అందులో వేసి మిశ్రమాన్ని మళ్లీ బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడుతున్న దశలో కుంకుమపువ్వు నానబెట్టిన పాలను అందులోపోసి బాగా కలపాలి. ఒకటి రెండు నిమిషాల తర్వాత స్టవ్‌ మీద నుంచి కడాయిని దించి మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత అందులో రోజ్‌వాటర్‌ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని  మౌల్డ్‌లో  పోసి ఐస్‌క్రీమ్‌ పుల్లలను దానికి గుచ్చి డీప్‌ ఫ్రిజ్‌లో ఐదారుగంటల సేపు అలాగే ఉంచాలి. అంతే టేస్టీ...హెల్దీ ‘ఓట్స్‌ అండ్‌ నట్స్‌ కుల్ఫీ’ రెడీ...

Updated Date - 2021-03-22T17:39:39+05:30 IST