చెవి వద్ద పేలిన దీపావళి రాకెట్‌

Published: Sun, 14 Nov 2021 10:20:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కానిస్టేబుల్‌కు వినికిడి సమస్య

హైదరాబాద్/బంజారాహిల్స్‌: శుభకార్యంలో వెలిగించిన దీపావళి రాకెట్‌ చెవి దగ్గరకు వచ్చి పేలడంతో ఓ కానిస్టేబుల్‌ వినికిడి సమస్య బారిన పడ్డారు. నగరానికి చెందిన బి. సందీప్‌, భీష్మకుమార్‌ జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ కార్‌-2లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 12న యూసు్‌ఫగూడ కార్మికనగర్‌లో జరుగుతున్న వివాహ వేదిక వద్ద బాణాసంచా పేలుస్తుండడంతో శబ్ద కాలుష్యం వస్తోందని స్థానికులు 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించేందుకు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారు. ఈ విషయంపై మాట్లాడుతుండగా ఓ వ్యక్తి దీపావళి రాకెట్‌ కాల్చాడు. అది కానిస్టేబుల్‌ చెవి వద్దకు వచ్చి పేలింది. ఆ ధాటికి అతడి కుడి చెవి పనిచేయలేదు. ఈఎన్‌టీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా చెవిలో రంధ్రం పడినట్టు గుర్తించారు. సందీప్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు రాకెట్‌ కాల్చిన నరే్‌షపై కేసు నమోదు చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.