కరోనాబాధితులకు గుండెపోట్లు

ABN , First Publish Date - 2021-05-07T06:22:08+05:30 IST

కరోనా రోగుల్లో ఎక్కువ మంది హార్ట్‌ఎటాక్‌లకు గురవుతూ మరణిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి.

కరోనాబాధితులకు గుండెపోట్లు

యూత్‌ను వెంబడిస్తున్న  స్ట్రోక్‌లు 

పెరిగిపోతున్న మరణాల సంఖ్య 

ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలోనే ఎక్కువ లక్షణాలు 

ముందస్తు పరీక్షలు, ధైర్యమే పరిష్కారమంటున్న వైద్యులు 

నిర్మల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : కరోనా రోగుల్లో ఎక్కువ మంది హార్ట్‌ఎటాక్‌లకు గురవుతూ మరణిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనాకు గురై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన తరువాత కూడా కొంతమందిలో గుండెపోటు లక్షణాలు బయట పడుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. ప్రధానంగా సెకండ్‌ వేవ్‌ కరోనా కారణంగా యువకులే ఎక్కువగా గుండెపోట్లకు గురవుతుండడం చర్చనీయాంశమవుతోంది. కరోనా సోకిన ఏడురోజుల అనంతరం కొన్ని రకాల రక్తపరీక్షలు చేసుకున్న వారిలో స్ర్టోక్‌ లక్షణాలు బయట పడుతున్నా యి. కరోనా కారణంగా రక్తం గడ్డ కడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఈ రక్తం గడ్డ కడుతున్న విషయాన్ని గుర్తించకపోతుండడం డాక్టర్‌లు కూడా ఆ కోణం లో పరీక్షలు జరపకపోతుండడం, చికిత్సలు చేయకపోతున్న కారణంగా ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నారు. గత పదిహేను రోజుల నుంచి నిర్మల్‌ జిల్లాలో కరోనాబారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ఇలా 50 మందికి పైగా గుండెపోటుతో మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే మందులను వినియోగించకపోతుండడం కారణంగానే ఇలాంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయంటున్నారు. కరోనా సోకిన వారం రోజుల తరువాత రక్తపరీక్షలు చేసుకున్నట్లయితే దానికి అనుగుణంగా డాక్టర్‌లు రక్తం పలచబడే మందులను సూచిస్తారని వాటిని వినియోగిస్తే బ్రెయిన్‌స్ర్టోక్‌, హార్ట్‌స్ర్టోక్‌లను నివారించే అవకాశం ఉంటుందంటున్నారు. దీంతో పాటు కరోనాకు గురై పరిస్థితి విషమించిన వారు తీవ్రమైన భయాందోళనకు గురవుతుండడం కూడా ఈ హార్ట్‌ఎటాక్‌లకు కారణమవుతోందంటున్నారు. నిర్మల్‌ జిల్లా లో కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య పెరిగిపోతుండడం దానికి అనుగుణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండ డం అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు కూడా చెడిపోతూ కొంతమంది మరణిస్తుండగా ఎక్కువ మంది గుండెపోట్లతోనే మరణిస్తున్నారంటున్నారు. ఇదిలా ఉండగా కరోనాకు గురైన రోగులంతా 

మానసిక 

దైర్యంతో మంచి ఆహారాన్ని తీసుకొని డాక్టర్‌లు సూచించిన  విధంగా మందులను వాడినట్లయితే ఎలాంటి ప్రాణనష్టం జరగదంటున్నారు. చాలా మంది వైద్యులను సంప్రదించకుండానే సొంతంగా తమ ఇళ్లలోనే మందులను వాడుతూ వ్యాధితీవ్రతకు గురవుతున్నారు. కరోనాలోడ్‌ తీవ్రంగా పెరిగిపోయిన తరువాత ఆ సుపత్రుల్లో చేరడం ఇక్కడ ఆసుపత్రుల్లో రెమిడెసివర్‌ ఇం జక్షన్‌తో పాటు ఆక్సిజన్‌ కొరత తీవ్రం కావడంతో చాలా మంది ప్రాణాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. సరియైున అవగాహన లేకపోవడం, భయం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నందునే గుండెపోట్లకు గురవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

యూత్‌ను వెంటాడుతున్న హార్ట్‌ఎటాక్‌లు

సెకండ్‌వేవ్‌ కరోనా కారణంగా ఈ సారి ఎక్కువ మంది 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారే తీవ్రంగా నష్టపోతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి కరోనా పాజిటివ్‌ లక్షణాలు యూత్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరణాల రేటు కూడా యూత్‌నే వెంటాడుతోంది. జిల్లాలో గత కొద్దిరోజుల నుంచి దాదాపు 50 మందికి పైగా యువకులు కరోనాకు గురై మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో కరోనా నెగెటివ్‌ వచ్చినవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం ప్రాదాన్యతను సంతరించుకుంటోంది. ప్రధానంగా ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణించడం, అలాగే గుండెపోట్లతో ఎక్కువ మంది యువకులు మరణిస్తున్నారంటున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణంలోనే దాదాపు 25 మందికి పైగా యువకులు ఇలా గుండెపోట్లతో మరణించడం సమస్య తీవ్రతను వెల్లడిస్తోందంటున్నారు. 


సరైన పరీక్షలు.. ధైర్యమే ఆయుధంగా..

కాగా కరోనా పాజిటివ్‌ లక్షణాలున్న వారు మరికొన్ని ఇతర రకాల పరీక్షలను డాక్టర్‌ల సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుందంటున్నారు. దీంతో పాటు పాజిటివ్‌కు గురై వైద్యచికిత్సలు పొందుతున్న వారంతా తమ ధైర్యాన్ని కోల్పోకుండా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. సరియైున పరీక్షలు చేసుకోకుండా దానికి అనుగుణమైన మందులను వాడకుండా మనోధైర్యం కోల్పోతున్న వారే ఎక్కువగా హార్ట్‌ఎటాక్‌లకు గురవుతున్నారని చెబుతున్నారు. యువకులే కాకుండా 50 సంవత్సరాలు పై బడిన వారు కూడా ఇలా గుండెపోట్లకు గురవుతూ మరణిస్తున్నారని పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో చేరే వారు అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి మానసికంగా కుంగిపోతున్నారని చెబుతున్నారు. దీని కారణంగానే వారు ఒత్తిడి ఆందోళనకు గురై గుండెపోట్లకు చేరవుతున్నారని చెబుతున్నారు. కరోనా సోకిన ఏడురోజుల తరువాత రక్తం గడ్డ కట్టే అంశానికి సంబంధించి సరియైున పరీక్షలు చేయించుకున్నట్లయితే గుండెపోట్లకు ఆస్కారం ఏర్పడబోదని వివరిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా డాక్టర్‌లు రక్తాన్ని పలచన చేసే మందులు అందించే వీలు కలుగుతుందంటున్నారు. దీంతో గుండెపోట్ల నుంచి తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. 

అవగాహన రాహిత్యం కారణంగానే..

కరోనా లక్షణాలు బయటపడుతున్న వారిలో చాలా మంది ఇంటివద్దనే సొంతవైద్యం చేసుకుంటుండడం ప్ర మాదకరంగా మారుతుందంటున్నారు. డాక్టర్లను సంప్రదించకుండానే మందులను వాడుతుండడంతో పాటు ఇళ్లలోనే సొంతంగా ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుండడం కూడా ప్రాణ ప్రమాదాలకు కారణమవుతోందంటున్నారు. కరోనా 


తీవ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అవగాహన లేకుండా వ్యవహరిస్తుండడంతోనే ముప్పు ఏర్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి సరియైున పరీక్షలు, వైద్యచికిత్సలు తీసుకున్నట్లయితే హార్ట్‌ఎటాక్‌ల నుంచి కాపాడుకోగలుగుతారని వివరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కరోనా జాగ్రత్తలపై విసృతంగా ప్రచారం జరుగుతుండడం, వైద్య,ఆరోగ్యశాఖ కూడా దీనిపై జనంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఆ ప్రయత్నాలు కొంత మేరకే ప్ర యోజనకరమవుతున్నాయంటున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తమై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చని డాక్టర్‌లు సూచిస్తున్నారు. 

పరీక్షలు తప్పనిసరి

కరోనాకు గురైన వారు ఏడు రోజుల తరువాత కొన్ని రకాల రక్త పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్తం గడ్డ కట్టే విషయమై జరుపుకునే పరీక్షల ద్వారా హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ముందుగానే గుర్తించవచ్చు. రక్తం గడ్డ కట్టినట్లయితే గుండెపోట్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. పరీక్షల ద్వారా గుర్తించి డాక్టర్‌లు రక్తంను పలుచన చేసే మందులు అందించే అవకాశం ఏర్పడుతుంది. దీంతో కరోనా బాధితులందరు హార్ట్‌ఎటాక్‌ల నుంచి రక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డాక్టర్‌లను సంప్రదించి సరియైున వైద్యం చికిత్సలు పొందడం అలాగే మానసిక దైర్యంతో ఉండడంతో పాటు మంచి ఆహారం, వ్యాయామ నియమాలను పాటించాలి. 

- డాక్టర్‌ జగన్నాథం, కార్డియాలజి్‌స్ట్‌ 


Updated Date - 2021-05-07T06:22:08+05:30 IST