ఉద్యాన సాగు విస్తృతం!

ABN , First Publish Date - 2021-01-17T05:27:59+05:30 IST

రైతులకు ప్రోత్సాహ కాలను అందించి జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెం చేందుకు ఉద్యానశాఖ అధికారులు లక్ష్యంగా ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నారు. 2020-21 సీజన్‌కు 2 లక్షల మొ క్కల పంపిణీని చేపట్టాలని నిర్ణయించారు.

ఉద్యాన సాగు విస్తృతం!

పండ్ల మొక్కలను పెంచడమే ధ్యేయం

జిల్లాలో 2లక్షల మొక్కల పంపిణీ లక్ష్యం

రైతులకు చేయూత ఇచ్చేందుకు ప్రణాళికలు


ఒంగోలు(జడ్పీ), జనవరి 16: రైతులకు ప్రోత్సాహ కాలను అందించి జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెం చేందుకు ఉద్యానశాఖ అధికారులు లక్ష్యంగా ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నారు. 2020-21 సీజన్‌కు 2 లక్షల మొ క్కల పంపిణీని చేపట్టాలని నిర్ణయించారు. అనేక రకా ల పండ్ల జాతుల మొక్కలను ఇందుకోసం ఎంపిక చే శారు. వీటిలో ప్రధానంగా బొప్పాయి, నిమ్మ, స్వీట్‌లెమె న్‌, దానిమ్మ, ఉసిరి తదితర రకాలు ఉన్నాయి. వీటి ప ంపిణీ కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకే కాకండా రహదారులకు ఇరు వైపులా, నివాస ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, అవసరాన్ని బట్టి నీడనిచ్చే మొక్కలు, ఔషధ మొక్కల ను కూడా ఇతర శాఖలు పంపిణీ చేయనున్నాయి. ప్రై వేటు సంస్థలకు, వ్యక్తులకు తక్కువ ధరకే వీటిని పంపిణీ చేసేలా ప్రణాళికలు చేపడుతున్నారు.


రైతుల కోసం అనేక పథకాలు


జిల్లాలో ఉద్యాన సాగు పెంచడమే లక్ష్యంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యం గా సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ర్టీయ కిసాన్‌ వికాస యోజన ఉన్నాయి. ఈ స్కీమ్‌ల ద్వారా కూడా ఉద్యాన సాగు చేసే రైతులకు అనేక రాయితీలు వర్తి స్తాయి. ఈ ఏడాది రాయితీల కింద దాదాపు రూ.25 కోట్లను ఉద్యాన సాగు చేసే రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాలకు తోడు ఉచి తంగా అందించే మొక్కల పంపిణీ కూడా పెద్ద ఎ త్తున జరిపి జిల్లాలో ఉద్యాన సాగులో గణనీయమైన పురోగతి సాధించాలనుకున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.


జిల్లాలో 15వేల హెక్టార్లకు రాయితీలు


జిల్లాలో వివిధ పథకాల కింద 15,000 హెక్టార్ల ఉ ద్యాన పంటలకు రాయితీలు అందించే విధంగా కసర త్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పండ్ల సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు కొత్తగా ఉద్యాన పం టల సాగువైపు రైతులు మళ్లీ విధంగా అందించే ప్రో త్సాహకాలను వివరించడం, దిగుబడులకు మార్కెటిం గ్‌ సౌకర్యాన్ని కల్పించడం తదితర అంశాల మీద రైతు లకు అవగాహన కల్పిస్తున్నామని సంబంధిత శాఖ అ ధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2021-01-17T05:27:59+05:30 IST