వేడెక్కిన రాజకీయం

ABN , First Publish Date - 2021-02-27T04:06:23+05:30 IST

గ్రాడ్యుయేట్స్‌ శాసన మండలి ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది..

వేడెక్కిన రాజకీయం

- ఆసక్తిగా మారిన గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షాలు

- పట్టభద్రుల సమస్యలపై వాదోపవాదాలు

- ప్రచారంలో రూటు మార్చిన అభ్యర్థులు

- ప్రతీ ఓటరును కలిసేలా ప్రచార వ్యూహాలు

- ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్రులు

- గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రాడ్యుయేట్స్‌ శాసన మండలి ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది.. ఉద్దండులు బరిలోకి దిగడంతో ఈ ఎన్నిక, ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.. పాలమూరు కేంద్రంగా మాటల యుద్ధం మొదలైంది.. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, విద్యా రంగ, పట్టభద్రుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం సాగుతోంది.. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమ్మేళనాలతో ఒక దఫా ప్రచారం ముగించిన అభ్యర్థులు, కీలకమైన ఈ 13 రోజులూ నేరుగా ఓటర్లని కలిసేలా ప్రచార వ్యూహం రూపొందించుకున్నారు.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు, వామపక్షాల మద్దతుతో బరిలో దిగిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ఉపాధ్యాయ, నిరుద్యోగుల అండతో బరిలోకి వచ్చిన హర్షవర్ధన్‌రెడ్డి దీటుగా ప్రచారం చేస్తున్నారు.. ఉమ్మడి పాలమూరు ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన వీరు, క్షేత్రస్థాయి ప్రచారానికి తెరలేపారు..

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మార డంతో, ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ప్రచార వ్యూహం మార్చారు. సంప్రదాయానికి భిన్నంగా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. సూక్ష్మస్థాయిలో ఓటర్లను కలిసేలా, ప్రతి ఓటరుని కలిసి ఓటు అభ్యర్థించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

- బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు గెలుపు కోసం ఆ పార్టీ పాలమూరు జిల్లా కు ఒక బృందాన్ని నియమించింది. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని ని యమించింది. వీరు ఓటర్లను కలుస్తూ వారి మనోభావాలు, అభిప్రాయాలను తె లుసుకుంటూ, వాటిని తీర్చేలా ముఖ్య నాయకులతో మాట్లాడిస్తూ ముందుకెళుతు న్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించింది.

- ఈ ఎన్నికలో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థి వా ణీదేవి గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేల భుజస్కంధాలపై ఉంచింది. బు ధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శనివారం ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కల సన్నాహక సమావేశాలను నిర్వహించాలని, ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్లను కలిసి తమ ప్రభుత్వ హయాంలో చేసిన ఉద్యోగ నియామకాలు, 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన విష యం, తాజా పీఆర్‌సీ కూడా తప్పకుండా ఇస్తామనే విషయాలని తెలియజేయాల ని సూచించారు. మండలాల వారీగా, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఇప్పటికే బాధ్యుల ను గుర్తించిన ఎమ్మెల్యేలు ఇక సూక్ష్మస్థాయి ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

- కాంగ్రెస్‌ తరుపున మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి బరిలో నిలిచారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఈయన గెలుపు కోసం వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామక హామీలు నెరవేర్చకపోవడం, దళిత, గిరిజనవాడల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తొలగించడం వంటి అంశాలతో పాటు పాలమూరు జిల్లా అభ్యున్నతికి కాంగ్రెస్సే ప్రధానంగా కృషి చేసిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి, బీజేపీ అభ్యర్థి రాంచంద్‌రావు టార్గెట్‌గా కాంగ్రెస్‌ ప్రచారం నిర్వహిస్తోంది. 

- అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.ర మణ ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుకగా తనకు  అవకాశమివ్వాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉ న్న వ్యక్తుల్లో ఏకైక బీసీగా ఉన్న రమణను గెలిపించాలని కోరుతూ బీసీ సం ఘాలు ప్రచారం చేపట్టాయి. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వంటి కీలక సంఘాలు నేరుగా మద్దతిస్తున్నాయి.

- స్వతంత్రంగా బరిలో దిగిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమ్మేళనాలు నిర్వహించారు. ఆయనకు మద్దతుగా వామపక్షాలు, వామపక్ష ఉపాధ్యాయ సం ఘాలు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 

- ఇంకో కీలక పోటీదారు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి ప్రచారంలో వేగంగా ముందుకుపోతున్నారు. టీపీఆర్‌టీయూ, నిరుద్యోగ సంఘాలు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్ని చుట్టి వచ్చిన ఆయన, నిరుద్యోగుల మేళాలు నిర్వహిస్తూ తన గెలుపు ఆవశ్యకతని వివరిస్తున్నారు. 

కాగా, ప్రధాన పార్టీలకు దీటుగా నాగేశ్వర్‌, హర్షవర్ధన్‌రెడ్డి ప్రచారం నిర్వహి స్తుండటం, ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇరుకన పడేలా అంశాలను తెరమీదకు తెస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Updated Date - 2021-02-27T04:06:23+05:30 IST