భారీగా కరెంట్‌ చార్జీల బాదుడు!

Published: Tue, 08 Mar 2022 02:56:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారీగా కరెంట్‌ చార్జీల బాదుడు!

డిస్కమ్‌లకు సబ్సిడీలు పెంచని ప్రభుత్వం

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కరెంట్‌ చార్జీల బాదుడు ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్‌లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేటాయింపులు లేకపోవడంతో డిస్కమ్‌లు భారీ బాదుడుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, లోటెన్షన్‌లో గృహేతర, హైటెన్షన్‌ వినియోగదారులకుయూనిట్‌కు రూ.1లు పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించారు. చార్జీలపెంపు రూపం లో రూ.6,831 కోట్లను వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌/టారిఫ్‌ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలిలో సమర్పించిన విషయం విదితమే. నేడో రేపో కరెంటు చార్జీల పెంపు కోసం ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇవ్వనుంది. రూ. 6 వేల కోట్లపైన కరెంట్‌ చార్జీల పెంపు భారం ఉండనుంది. డిస్కమ్‌లు భారీగా చార్జీల పెంపునకు నిర్ణయం తీసుకోగా.. ఆ మేరకు భారం ఉండదని, చార్జీలు భారీగా పెంచకుండా ప్రభుత్వం సబ్సిడీ పెంచుతుందని అంతా భావించారు. ఇంతలో ఒక్కరూపాయి కూడా సబ్సిడీ పెంచేది లేదని బడ్జెట్‌లో తేలిపోయింది. మరోవైపు వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా చేయడానికి అయ్యే వ్యయం భారీగా పెరుగుతున్నా.. ఆ మేరకు సబ్సిడీలు పెంచకపోవడంతో డిస్కమ్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోనున్నాయి.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.