పదో తేదీతో ముగియనున్న శ్రీరాం ప్రాపర్టీస్ ఐపీఓపై... భారీ అంచనాలు...

ABN , First Publish Date - 2021-12-08T21:16:12+05:30 IST

శ్రీరాం ప్రాపర్టీస్ ఐపీఓ... ఈ రోజు(బుధవారం) నుంచి ప్రారంభమైంది.

పదో తేదీతో ముగియనున్న శ్రీరాం ప్రాపర్టీస్ ఐపీఓపై... భారీ అంచనాలు...

ముంబై : శ్రీరాం ప్రాపర్టీస్ ఐపీఓ... ఈ రోజు(బుధవారం)  నుంచి ప్రారంభమైంది. పదో తేదీతో ముగియనుంది. ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 113-118. ఇష్యూ సైజ్‌ రూ. 600 కోట్లు. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 350 కోట్లను సేకరించాలన్నది కంపెనీ యోచనగా ఉంది. ఈ క్రమంలో సమకూరనున్న డబ్బును రుణాల చెల్లింపునకు, కొత్త ప్రాజెక్ట్‌ల కోసం వినియోగించనుంది. కాగా... ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో పార్టిసిపేట్‌ చేయడం లేదు, కేవలం ప్రస్తుత వాటాదారులు మాత్రమే వాటాలను అమ్ముతున్నారు. ఐపీఓ తర్వాత, ప్రమోటర్ల వాటా 32 శాతం నుంచి 28 శాతానికి తగ్గిపోనుంది.


అఫర్డబుల్‌, మిడ్‌-మార్కెట్‌ సెగ్మెంట్లలో బలమైన ప్రాజెక్టులు చేతిలో ఉన్నపన్పటికీ... ప్రస్తుతానికి మాత్రం ఇది నష్టాల్లో ఉన్న కంపెనీయే.  . బెంగళూరు, చెన్నై, కోల్‌కతాపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రీమియంతో ట్రేడవుతున్న తోటి కంపెనీలతో పోలిస్తే, నెట్‌ అసెట్‌ వాల్యూకు   డిస్కౌంట్‌లో ఐపీఓ ప్రైస్‌ ఉంది. రియల్‌ ఎస్టేట్‌కు పెరుగుతున్న డిమాండ్‌, రీజనబుల్‌ వాల్యూయేషన్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడవచ్చన్న అభిప్రాయాలున్నాయి. 


వ్యాపారం... 2000 లో మొదటి ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటి నుంచి, అఫర్డబుల్‌(యూనిట్‌కు రూ. 45 లక్షల వరకు), మిడ్-మార్కెట్(రూ. 45 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య) సెగ్మెంట్లపైనే కంపెనీ ఫోకస్‌ పెట్టింది.  ఇప్పటివరకు 16.8 మిలియన్ చదరపుటడుగుల స్పేస్‌ విక్రయం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో... అమ్మకానికిగాను 26.3 మిలియన్ చదరపుటఅడుగులు ఉంది. ఇందులో మూడింట రెండు వంతులు బెంగళూరు(42 %), చెన్నై(23 %)లో ఉన్నాయి. కోల్‌కతాలో దాదాపు 20 % ప్రాజెక్టులు ఉండగా, ఇందులో మిడ్‌ ఇన్‌కమ్‌ హౌసింగ్‌ వాటా 52 %, అఫర్డబుల్‌ హౌసింగ్‌ వాటా 31 %. 


ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 31 ప్రాజెక్టులుండగా, వీటిలో 26 కొనసాగుతున్నాయి, మరో ఐదు ప్రాజెక్టులను ప్రారంభించాల్సివుంది. జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, లేదా జాయింట్ వెంచర్ ద్వారా డెవలప్‌ చేసే అసెట్ లైట్ మోడల్‌లో బిజినెస్‌ చేస్తోంది. ఇటీవలి కాలంలో డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌ను కంపెనీ ప్రారంభించింది. ప్లానింగ్‌, అమలు, మార్కెటింగ్, సేల్స్‌ను ఇది చూస్తుంది. మొత్తం కంపెనీ ప్రాజెక్టుల్లో డీఎం వాటా దాదాపు 32 %.


ఆర్థిక స్థితిగతులు...

ఇది నష్టాల్లో ఉన్న కంపెనీ. కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌ల ప్రభావం తారస్థాయిలో ఉంది.  గత రెండు సంవత్సరాల్లో రాబడి స్థిరంగా తగ్గుతూనే ఉంది. సంస్థాగత పెట్టుబడిని అప్పుగా, నిర్మాణాత్మక పెట్టుబడులున్న కారణంగా వడ్డీ ఖర్చులను చూపాలన్న అకౌంటింగ్‌ నియమాల కారణంగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


వాల్యుయేషన్‌...  

ఎస్టిమేటెడ్‌ ఎన్‌ఏవీ రూ. 2,400-రూ. 3,200 కోట్లతో పోలిస్తే, ఈ ఐపీఓ... డిస్కౌంట్‌లో ఉంది. శోభ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్‌ సహా పోటీ కంపెనీలన్నీ వాటి ఎన్‌ఏవీల కంటే ఎక్కువలో ట్రేడవుతున్నాయి. నిన్న(మంగళవారం) యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 268 కోట్లను శ్రీరాం ప్రాపర్టీస్ సేకరించింది. ఒక్కొక్కటి రూ. 118 చొప్పున 22 మిలియన్ షేర్లను కేటాయించింది. బీఎన్‌పీ పారిబాస్ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరల్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సుందరం ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్ యాంకర్‌ కంపెనీల లిస్టులో ఉన్నాయి.

Updated Date - 2021-12-08T21:16:12+05:30 IST