బాబోయ్‌.. ఇదేం బాదుదు...!

ABN , First Publish Date - 2020-10-24T12:11:24+05:30 IST

వాహనదారులు నిబంధనలు ఉల్లం ఘిస్తే ఇకపై భారీగా జరిమానాలు చెల్లించాల్లిందే. ఆమేరకు రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

బాబోయ్‌.. ఇదేం బాదుదు...!

నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు ఇక భారీ జరిమానాలు


రోడ్డెక్కితే బాదుడే. పోలీసులకు చిక్కితే జేబు ఖాళీయే. తాజాగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రోడ్డు రవాణా నిబంధనలు వాహనదారులకు గుదిబండలా మారాయి. జరిమానాల భయంతో వారు వణికిపోతున్నారు. ఒకపక్క కొవిడ్‌తో ఉపాధి లేక అల్లాడుతుంటే బాదుడు మీద బాదుడేంటి అని గగ్గోలుపెడుతున్నారు. రోడ్డుప్రమాదాల నివారణ కోసమంటూ కళ్లు బైర్లు కమ్మేలా ఫైన్లు సిద్ధమైపోయాయి. అలాగే కఠిన నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. ఏకంగా లైసెన్స్‌ రద్దు చేసే చర్యలు ఉన్నాయి. దీంతో చిరుద్యోగులు, చిరువ్యాపారులు, నిత్యం పట్టణాలకు వెళ్లి పనులు చేసుకునే పేదలు బైకులు తీయాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు, పోలీసులు రోడ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. కఠిన నిబంధనల ఉద్దేశం ఏదైనా కానీ ఇంతా భారీగా జరిమానాలు విధించినంత మాత్రానా ప్రమాదాలు తగ్గుతాయా అనేది ప్రశ్నార్థకమే.


ఒంగోలు(క్రైం), అక్టోబరు 23 : వాహనదారులు నిబంధనలు ఉల్లం ఘిస్తే ఇకపై భారీగా జరిమానాలు చెల్లించాల్లిందే. ఆమేరకు రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదాలు నివారణ కోసం అమలులోకి వచ్చిన జరిమానాలు చూస్తే మైండ్‌బ్లాక్‌ అవుతోంది. రహ దారులపై వాహన దారుల ప్రయాణం పక్కనపెడితే కనీసం హారన్‌ కొట్టినా, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోయినా భారీ పెనాల్టీ చెల్లించాల్పిందే. 2018లో కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వాహన చట్టానికి సవరణ చేసింది. అప్పట్లో రవాణా శాఖ ఉద్యోగ సంఘాలు అప్పటి ప్రభు త్యానికి ఇప్పట్లో భారీగా పెంచిన జరిమానాలు అమలు చేయవద్దని విన్న వించుకున్నాయి. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్యం తాత్కాలికంగా నిలిపి వేసింది. అయితే ప్రస్తుతం కొవిడ్‌తో ప్రజలు అవస్థలు పడుతున్న ప్రభు త్వం భారీ జరిమానాలు అమలులోకి తెచ్చింది. మోటారుసైకిళ్లు, 7 సీట్ల వాహనాలు ఒక కేటగిరీ, భారీ వాహనాలు మరో కేటగిరీగా  విభజించి జరిమానాలు సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటిలో ముఖ్యంగా రహదారి ప్రమాదాల నివారణ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్యం జరిమానాలు పెంచి నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 


నిబంధనలు అతిక్రమిస్తే కొరడా

ద్విచక్రవాహనాలు, పరిమితికి మించిన బరువు రవాణా చేసే వాహనాలతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్యం అ లాంటి వాహనదారులపై కొరడా ఝళిపించింది. అంతేకాదు వాహన యజమానులు సైతం అప్రమత్తమయ్యే విధంగా సవరించిన జరిమానాలు ఉన్నాయి. ఉదా హరణకు లైసెన్స్‌ లేని వ్వక్తికి వాహనం ఇచ్చిన యజమాని కూడా భారీగా జరిమానా చెల్లించాల్సిందే. వరుసగా రెండు పర్యాయాలు నిబంధనలు ఉల్లం ఘిస్తే వాహనదారుని లైసెన్సు మూడు నెలలు రద్దుచేయడంతో పాటుగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  అయితే  ఈ విధంగా ప్రభుత్యం ఉన్న ఫళంగా జరిమానాలు విధించడంపై ప్రజలలో వ్యతిరేకత కూడా వస్తోంది. రోడ్డుప్రమాదాలపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన ప్రభుత్యం భారీగా జరిమానాలు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఉత్తర్వులు ఇప్పటికే విడుదల కావడంతో భారీ జరిమానాలు అమలులోకి వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబు తున్నారు. 


పెంచిన జరిమానాల వివరాలు

ద్విచక్ర వాహనదారులు, సెవెన్‌ సీటర్ల వాహనాలకు సంబంధించి వాహన చెకింగ్‌ విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాక రించినా రూ.750లు, అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇచ్చినా, మైనర్లకు వాహనం ఇచ్చినా రూ.5వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10వేలు, నిబంధనలకు విరుద్ధంగా వాహ నాలలో మార్పులు చేస్తే రూ.5వేలు, అతివేగంగా వాహనం నడిపితే రూ.1000, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, దూకుడుగా వాహనం నడిపితే రూ.10 వేలు, రేసింగ్‌ మొదటిసారి రూ.5వేలు, రెండోసారి రూ.10వేలు విధించా రు. భారీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ లేకున్నా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకున్నా మొదటిసారి రూ.2వేలు, రెండోసారి రూ.5వేలు, పర్మిట్లు లేని వాహనాలు వాడితే రూ. 10వేలు, పరిమితికి మించి బరువు రవాణా చేస్తే రూ.20వేలు, ఆపై ఒక్కో టన్నుకు రూ.2వేలు అదనం. వాహనం బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ. 40వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం నూతనంగా ఉత్తర్వులు జారీచేసింది. 


జరిమానాలు పెంచితే ప్రమాదాలు తగ్గవు- సామా వెంకటేశ్వర్లు, వాహనచోదకుడు

జరిమానాలు పెంచినంత మాత్రాన రోడ్డుప్రమాదాలు తగ్గవు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే భారీ జరిమానాలు సామాన్యుడిపై మోతే. ప్రజల్లో రోడ్డుప్రమాదాలపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయి. అందుకోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి కానీ ఇలా జరిమానాల బాదుడుతో కాదు.


ప్రమాదాల నివారణకు భారీ జరిమానాలు-  శ్రీకృష్ణవేణి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌

రహదారులపై ప్రమాదాలు నివారించేందుకు రాష్ట్రప్రభుత్వం భారీ జరిమానాలు అమల్లోకి తెచ్చింది. వాహనదారులు నూతనంగా అమల్లోకి వచ్చిన జరిమానాలపై అవగాహన పెంచుకోవాలి. లైసెన్స్‌ లేని వారికి ఎవరూ వాహనాలు ఇవ్వొద్దు. ప్రస్తుతం పెంచిన జరిమానాలు అమల్లో ఉన్నాయి.

Updated Date - 2020-10-24T12:11:24+05:30 IST