ఉధృతంగా వైరా, కట్టలేరు..

Sep 28 2021 @ 00:32AM
దొడ్డదేవరపాడు కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు

వీరులపాడు: వైరా, కట్టలేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దొడ్డదేవరపాడు కాజ్‌వేపై ఐదు అడుగుల మేర వరద ప్రవహించటంతో రాకపోకలు నిలిపివేశారు. పళ్లెంపల్లి కూడలి చప్టాపై 15 అడుగుల మేర వరదనీరు ప్రవహించటంతో ఎస్సై సోమేశ్వరరావు, తహసీల్దార్‌ విక్టర్‌బాబు గస్తీని ఏర్పాటు చేశారు. ఏనుగుగడ్డ వాగు మరింత ఉధృతంగా ప్రవహించటంతో దొడ్డదేవరపాడు, రంగాపురం గ్రామాలకు వెళ్లే ప్రజలు వరద ఉధృతి తగ్గే వరకు ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు. సోమవారం రాత్రికి వరద మరింత పెరిగే అవకాశమున్నందున వెల్లంకి నుంచి కొణతాలపల్లి, పల్లెంపల్లి నుంచి వీరులపాడు, వీరులపాడు నుంచి జయంతి వైపునకు వెళ్లే వాహనదారులు వరద పరిస్థితులు తెలుసుకుని రాకపోకలు సాగించాలన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.