భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-02-27T00:53:37+05:30 IST

అక్రమంగా తరలిస్తున్నగుట్కా ప్యాకెట్లను ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు.

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

శ్రీకాకుళం: అక్రమంగా తరలిస్తున్నగుట్కా ప్యాకెట్లను ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి ఏపీ గుండా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇచ్చాపురం పోలీసులు రహదారిపై వాహన తనఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా గుట్కాను తరలిస్తున్న కంటైనర్‌లో సోదాలు చేశారు. కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్నగుట్కా ప్యాకెట్లను భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్ల విలువ దాదాపు రూ. 24.75 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కంటైనర్‌ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-02-27T00:53:37+05:30 IST