తిరుమలలో జోరువాన

Published: Tue, 17 May 2022 02:26:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుమలలో జోరువానఆలయం ముందు కురుస్తున్న వర్షం

ఇబ్బంది పడిన భక్తులు


తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం జోరు వాన కురిసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి వరకు జోరుగా కురిసింది. దాంతో ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధుల్లో నీరు నిలిచింది. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కొందరు భక్తులు వర్షంలో తడిచారు. మరికొందరు మంది దగ్గర్లోని షెడ్లలో సేదతీరారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇక్కట్లు ఎదుర్కున్నారు. గదులు లభించని భక్తులు అవస్థ పడ్డారు. మరోవైపు ఘాట్లలో ప్రయాణించే వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలంటూ అలిపిరి, జీఎన్సీ టోల్‌గేట్‌లో ప్రచారం చేశారు. కాలినడకన వచ్చే యాత్రికులు వర్షంలో తడుస్తూనే వెళ్లారు. కాగా, వర్షం రెండు, మూడ్రోజులుగా కురుస్తుండటంతో ఘాట్లపై విజిలెన్స్‌, ఫారెస్ట్‌, ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. తరచూ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తున్నారు. వర్షం కారణంగా సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చలితీవ్రత కొండపై పెరిగింది. 

తిరుమలలో జోరువానవర్షానికి షెడ్ల కింద నిలబడి ఉన్న భక్తులు


తిరుమలలో జోరువానవర్షంలో తడుస్తూ వెళుతున్న భక్తులు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.