Amalapuramలో భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-05-24T16:44:06+05:30 IST

అమలాపురంలో భారీగా పోలీసులు మోహరించారు. పేరు మార్పుపై కోనసీమ జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఛలో అమలాపురం ర్యాలీ నిర్వహించనున్నారు.

Amalapuramలో భారీగా పోలీసుల మోహరింపు

కోనసీమ జిల్లా: అమలాపురంలో భారీగా పోలీసులు మోహరించారు. పేరు మార్పుపై కోనసీమ జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఛలో అమలాపురం ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ర్యాలీలు, ఊరేగింపులు చేయొద్దని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి  హెచ్చరించారు. అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. కోనసీమ జిల్లాకు పేరు మార్చవద్దంటూ మధ్యాహ్నం  భారీ ర్యాలీగా అమలాపురం తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో అమలాపురంలలో ఎక్కడికక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించారు. 

Updated Date - 2022-05-24T16:44:06+05:30 IST