భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2020-11-27T05:26:52+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు అగనంపూడి, ఉక్కు నిర్వాసిత, ఫార్మాసిటీ పునరావాస కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి.

భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
అగనంపూడిలో వర్షం కురుస్తున్న దృశ్యం

అగనంపూడి, నవంబరు 26: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు అగనంపూడి, ఉక్కు నిర్వాసిత, ఫార్మాసిటీ పునరావాస కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. శనివాడ, గల్లవానిపాలెం, ఇస్పాత్‌నగర్‌, జనచైతన్యనగర్‌, అన్నపూర్ణానగర్‌, కేఎస్‌ఎన్‌రెడ్డి నగర్‌, గల్లవానిపాలెం, ఈ- మర్రిపాలెం, దిబ్బపాలెం వీధుల్లో నీరు నిలిచిపోయింది. 

 

 కూర్మన్నపాలెం: వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చలిగాలులతో ప్రజలు బయట కు వచ్చేందుకు భయపడుతున్నారు. 


 పొంగి పొర్లుతున్న వాగులు, గెడ్డలు

పరవాడ: మండల వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో వాగులు, గెడ్డలు పొంగి పొర్లుతున్నా యి. ప్రధాన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పరవాడ మల్లోడి గెడ్డ, పెద చెరువు మదుంపై నుంచి వరద నీరు  ప్రవహిస్తోంది. ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరంలో  అలలు ఎగసిపడుతున్నాయి. 

 

లంకెలపాలెంలో...

లంకెలపాలెం: లంకెలపాలెం, పరిసర ప్రాంత గ్రామాల్లో  భారీ వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. స్థానిక ఏలేరు కాలువ వద్ద రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. 

 

గాజువాక: తుఫాన్‌ ప్రభావంతో గాజువాకలోవర్షం కురిసింది. చలితో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. 

Updated Date - 2020-11-27T05:26:52+05:30 IST