Heavy Rain: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-08-04T12:19:03+05:30 IST

ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapur District) లోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజూ భారీ వర్షాలు కురిశాయి.

Heavy Rain: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapur District) లోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజూ భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి 13 మండలాల్లో వర్షం కురిసింది. కంబదూరులో అత్యధికంగా 79.2, ఆత్మకూరులో 53.6, కుందుర్పిలో 45.2, కూడేరులో 34.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం నగరంతోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. కూడేరు మండలం చోళసముద్రం గ్రామంలో విధులన్నీ జలమయమయ్యాయి. సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహరిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. కంబదూరు, కళ్యాణదుర్గం, ఉరవకొండ మండలాల్లోని పలు ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు చేరడంతో టమోటా, వేరుశనగ, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. జల్లిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆరు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2022-08-04T12:19:03+05:30 IST