వర్షంతో జలమయమైన కొవ్వూరు మెయిన్ రోడ్డు
కొవ్వూరు, జనవరి 24: పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై అరగంట సేపు కుండపోతగా వర్షం కురిసింది. రహదారులు, పల్ల పు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణంలోని ప్రధాన రహదారిలో జైన్ మందిరం, అపోలో మెడికల్ షాపు వద్ద, పట్టణంలోని వివిధ ప్రాంతాలలో డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో పాఠశాలల విద్యార్ధులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షంతో రహదారిపై ఉన్న గోతులు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు గుంతలు కనిపించక ఇబ్బందులు పడ్డారు.