Heavy Rain: ఏలూరు జిల్లాలో కుండపోత

ABN , First Publish Date - 2022-09-20T02:59:06+05:30 IST

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏలూరు జిల్లావ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి.

Heavy Rain: ఏలూరు జిల్లాలో కుండపోత

ఏలూరు: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏలూరు జిల్లావ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల (Heavy Rain)తో జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం (Eluru city) పూర్తిగా జల మయమైంది. ఏ వీధి చూసినా చెరువులను తలపించాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి మోకాళ్లలోతున నీటితో నిండిపోయింది. రిజిస్ట్రార్‌ కార్యాలయం, పవర్‌ పేట రైల్లేస్టేషన్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీగా నీరు నిలిచింది. నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలలో భారీగా వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం, గణపవరం, భీమడోలు, ఉంగుటూరు , పెదవేగి, పెదపాడు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో ఏలూరులో అత్యధికంగా 113.6 మిల్లీమీటర్ల్ల వర్షపాతం నమోదవగా జిల్లాలో సరాసరి వర్షపాతం 20.9 మి.మీ నమోదైంది.

Updated Date - 2022-09-20T02:59:06+05:30 IST