Heavy rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-08T19:28:46+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Heavy rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy rains) కురుస్తోంది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్‌, చైతన్యపురి, అంబర్‌పేట్, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మాన్సూన్ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. 

Updated Date - 2022-09-08T19:28:46+05:30 IST