హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2021-08-24T00:44:55+05:30 IST

నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్‌, మెహదీపట్నంలో వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్‌, మెహదీపట్నంలో వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం వేళ వర్షం పడడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు అవస్థ పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించింది. 

Updated Date - 2021-08-24T00:44:55+05:30 IST