Mumbaiలో అతి భారీ వర్షాలు...భారీ గాలులు

ABN , First Publish Date - 2022-07-07T15:29:55+05:30 IST

ముంబయి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం...

Mumbaiలో అతి భారీ వర్షాలు...భారీ గాలులు

ముంబయి(మహారాష్ట్ర): ముంబయి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.ముంబయి నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి.భారీవర్షాలతోపాటు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ముంబయిలో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.


ముంబయి నగరంలోని చునాభట్టి ప్రాంతంలో బుధవారం కొండచరియలు విరిగిపడటంతో 15 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన బుధవారం జరిగిన అధికారుల సమావేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాకాలంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం షిండే అధికారులను కోరారు.


Updated Date - 2022-07-07T15:29:55+05:30 IST