నగరంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-10-17T06:21:27+05:30 IST

అల్పపీడన ప్రభావంతో నగరంలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్నాయి.

నగరంలో భారీ వర్షం
చెరువును తలపిస్తున్న చావులమదుం బ్రిడ్జి ప్రాంతం

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో నగరంలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం పదిన్నర నుంచి సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. బీచ్‌రోడ్డు కాలువలు పొంగి ప్రవహించడంతో రహదారిపై చెత్త తిష్ఠ వేసింది. కాగా మధ్యాహ్నానికి వర్షం తెరిపివ్వడంతో పలుచోట్ల దుర్గాదేవి ఆలయాల వద్ద అన్నసమారాధనలు సజావుగా సాగాయి. 






Updated Date - 2021-10-17T06:21:27+05:30 IST