జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-02T05:39:51+05:30 IST

జిల్లాలో భారీ వర్షం

జిల్లాలో భారీ వర్షం
బొబ్బిలి పూల్‌బాగ్‌ రోడ్డులో చేరిన వర్షపు నీరు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వర్షం కురిసింది. బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, బొండపల్లి మండలాల్లో భారీగా వర్షం కురవగా, విజయనగరం, డెంకాడ, నెల్లిమర్ల, గుర్ల, గంట్యాడ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. బొబ్బిలి ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  


- బొబ్బిలి: బొబ్బిలి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగనన్న కాలనీల్లో వర్షపు నీరు ముంచెత్తింది. పట్టణంలోని పూల్‌బాగ్‌ రోడ్డు, కాలేజీ రోడ్డు, గొల్లపల్లి దా డితల్లి కాలనీ, నాయుడు కాలనీ, పాతబొబ్బిలి కాలనీల్లో భారీగా నీరుచేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.


- గంట్యాడ: మండలంలో సుమారు గంటపాటు వర్షం కురిసింది. ఇదే సమంలో పిడుగులు పడటంతో బురదపాటు రామాలయం పైకప్పు దెబ్బతిన్నది.  విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లోని ఏపీ ఫైబర్‌ నెట్‌ మిషన్లు దెబ్బతిన్నాయి. 


- సాలూరు రూరల్‌: సాలూరులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో పొలం పనులు జోరందుకున్నాయి


Updated Date - 2022-07-02T05:39:51+05:30 IST