
తిరుపతి: తిరుమలలో ఈదురుగాలులతోపాటు వర్షం దంచికొట్టింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తడిసిముద్దయ్యారు. తిరుమల ఘాట్ రోడ్, టోల్ గేట్, పాపవినాశనం, శ్రీవారి పాదాలతోపాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. తిరుమల ఘాట్ రోడ్‌లో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది, అధికారులు విరిగిపడిన చెట్లను తొలగించారు. చెట్లు విరిగిపడిన ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు.