వనపర్తిలో దంచికొట్టిన వాన

ABN , First Publish Date - 2021-10-17T04:17:31+05:30 IST

జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

వనపర్తిలో దంచికొట్టిన వాన
కొత్తకోటలో కోదండరామస్వామి ఆలయంలోకి చేరిన వర్షపు నీరు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 16 : జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులతో నిండి ఉన్న ఆకాశం.. అక్కడక్కడా జల్లులు కుశాయి.  మధ్యాహ్నం దాదాపు అరగంట సేపు వాన దంచికొట్టింది. దీంతో రహదా రులన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం కూడా ముసురు వాన కురిసింది. 

కొత్తకోటలో..

కొత్తకోట: కొత్తకోటలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధులలోని రోడ్లు జలమయమయ్యాయి. పట్టణ ఎగువ ప్రాం తపు వర్షపు నీరు దిగువకు వాగుల ప్రవహిం చడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రహదారి  నీటి ప్రవాహంతో వాగును తలపించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న కోదండరామస్వామి దేవాలయంలోకి నీరు చేరి చిన్నపాటి మడు గును తలిపించింది. 


Updated Date - 2021-10-17T04:17:31+05:30 IST