దంచికొట్టిన వాన

ABN , First Publish Date - 2021-10-17T04:46:07+05:30 IST

జడ్చర్లలో శనివారం సా యంత్రం వాన దంచికొట్టింది. సాయంత్రం ఏకధాటిగా గంటన్నరపాటు భారీ వర్షం పడింది. జడ్చర్ల మునిసిపా లిటీతో పాటు మండల వ్యాప్తంగా భారీ వర్షం పడింది. వర్షం 9 సెంటీ మీటర్లుగా నమోద య్యింది. చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది.

దంచికొట్టిన వాన
జడ్చర్లలోని త్రిశూల్‌నగర్‌ సమీపంలోని మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద తెగిన కట్ట

తడిసి ముద్దయిన జడ్చర్ల

9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

శివాజీనగర్‌ కాలనీవాసుల రాస్తారోకో


జడ్చర్ల, అక్టోబరు 16 : జడ్చర్లలో శనివారం సా యంత్రం వాన దంచికొట్టింది. సాయంత్రం ఏకధాటిగా గంటన్నరపాటు భారీ వర్షం పడింది. జడ్చర్ల మునిసిపా లిటీతో పాటు మండల వ్యాప్తంగా భారీ వర్షం పడింది. వర్షం 9 సెంటీ మీటర్లుగా నమోద య్యింది. చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. జడ్చర్ల మునిసి పాలిటీలోని లోతట్టు ప్రాంతాలలోకి నీళ్లు వచ్చాయి. పలు కాలనీలలో ఇళ్లల్లోకి వర్షం నీరు రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. పట్టణంలోని నేతాజీ చౌరస్తా నుంచి సిగ్నల్‌గడ్డ వెళ్లే దారిలోని వెంకట రమణ టాకీస్‌ సమీపంలో ప్రధాన రహదారిపై ఫీటున్నర మేర చిన్నపాటి చెరువును తలపించేలా వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. జడ్చర్ల - గంగాపూర్‌ గ్రామం వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆస్పత్రి ప్రాంగణమంతా వర్షం నీటితో మునిగిపో యింది.

మునిగిన లోతట్టు ప్రాంతాలు: జడ్చర్ల మునిసిపాలిటీలోని శివాజీ నగర్‌ కాలనీ, సంజీవయ్య నగర్‌ కాలనీ, రాజీవ్‌ నగర్‌ కాలనీలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు భారీ వర్షానికి మునిగిపోయాయి. శివాజీనగర్‌ కాలనీలలోని కొన్ని ఇళ్లోల్లోకి వర్షం నీరు రావడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. రాజీవ్‌నగర్‌ కాలనీలోని ఇళ్లల్లోకి సైతం వర్షం నీరు వచ్చింది.  

ధర్నా, రాస్తారోకో: భారీ వర్షానికి కాలనీలోకి, అలాగే పలు ఇళ్లోల్లోకి వర్షం నీరు రావడంతో శివాజీనగర్‌ కాలనీవాసులు జడ్చర్లలోని ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని నిమ్మబావి గడ్డకు వెళ్లే దారిలోని ప్రధాన రహదారిపై సుమారు గంట పాటు కాలనీవాసులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వర్షం పడితే కాలనీలోకి వర్షం నీరు వచ్చిచేరుతోందని, ఇళ్లల్లోకి సైతం వస్తున్నాయని, సమస్యను పరష్క రించాలంటూ డిమాండ్‌ చేశారు. 

తెగిన మినీట్యాంక్‌బండ్‌ కట్ట: జడ్చర్ల మునిసిపాలిటీలోని త్రిశూల్‌నగర్‌ సమీపంలోని మినీ ట్యాంక్‌బండ్‌ (నల్లకుంట) కట్ట శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తెగిపోయింది. పాతబజారు, రంగారావుతోట, సంజీవయ్య నగర్‌కాలనీలో నుంచి వచ్చిన వర్షం నీరంతా, మినీ ట్యాంక్‌బండ్‌లోకి వెళ్లాయి. జడ్చర్ల పట్ణణం జలమయమైంది.

వనపర్తిలో దంచికొట్టిన వాన

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా: జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులతో నిండి ఉన్న ఆకాశం.. అక్కడక్కడా జల్లులు కురిశాయి.  మధ్యాహ్నం దాదాపు అరగంట సేపు వాన దంచికొట్టింది. దీంతో రహదా రులన్నీ జలమయ మయ్యాయి. సాయంత్రం కూడా ముసురు వాన కురిసింది. 

కొత్తకోటలో 

కొత్తకోట: కొత్తకోటలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధులలోని రోడ్లు జలమయమయ్యాయి. పట్టణ ఎగువ ప్రాం తపు వర్షపు నీరు దిగువకు వాగుల ప్రవహిం చడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రహదారి  నీటి ప్రవాహంతో వాగును తలపించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న కోదండరామస్వామి దేవాలయంలోకి నీరు చేరి చిన్నపాటి మడు గును తలిపించింది. 







Updated Date - 2021-10-17T04:46:07+05:30 IST