భారీ వర్షం

Sep 27 2021 @ 00:01AM
అలుగుపారుతున్న బొంరా్‌సపేట్‌ చెరువు

  • బొంరాస్‌పేట్‌లో 36.5 మి.మీ. వర్షం 
  • మహంతీపూర్‌లో ఇళ్లలోకి చేరిన  వరద నీరు 
  • మత్తడి దూకిన  బాలంపేట్‌ చెరువు, మైల్వార్‌ ఎల్లమ్మ చెరువు


 (ఆంధ్రజ్యోతి,వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి)/ బొంరాస్‌పేట్‌/బషీరాబాద్‌: జిల్లాలో పలుచోట్ల ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొంరా్‌సపేట్‌, బషీరాబాద్‌, కులకచర్ల మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాత్రి 7 గంటల వరకు బొంరా్‌సపేట్‌లో 36.5 మి.మీ. వర్షం కురియగా, కులకచర్ల మండలం, పుట్ట      పహడ్‌లో 36.3మి.మీ, యాలాల్‌లో 30.3మి.మీ, బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లో 26.3 మి.మీ, బషీరాబాద్‌లో 19.0మి.మీ, పెద్దేముల్‌లో 9.8మి.మీ, ధారూరులో 2.8మి.మీ, ముజాహిద్‌పూర్‌లో 1.3మి.మీ. వర్షపాతం నమోదైంది.ఆదివారం సాయంత్రం బొంరా్‌సపేట్‌ మండలంలోని వడిచర్ల, ఎన్కెపల్లి, కొత్తూర్‌, మహంతీపూర్‌, జానకంపల్లి, బొంరా్‌సపేట్‌, తుంకిమెట్ల గ్రామాలతో పాటు మెట్లకుంట, బురాన్‌పూర్‌, మదన్‌పల్లి గ్రామా ల్లో భారీ వర్షం కురిసింది. మహంతీపూర్‌ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో పక్క పత్తి, కంది పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. బొంరా్‌సపేట్‌, మెట్లకుంట, ఏర్పుమళ్ల చెరువులు నిండాయి. కాకరవాణి ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. అదేవిధంగా దౌల్తాబాద్‌ మండలంలో భారీవర్షం కురవడంతో బాలంపేట్‌ చెరువు అలుగు పారింది. బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ఎల్లమ్మ చెరువు జలకళ సంతరించుకుంది. మత్తడి దూకుతూ జలసవ్వడి చేస్తోంది.  

గుంతల మయంగా..

తాండూరురూరల్‌: ఇటీవల కురస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. తాం డూరు-చించొళి మార్గంలోని అల్లాపూర్‌ బస్‌స్టేజీ వద్ద రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి అందులో నీరు నిలిచి ప్రమాదకరంగా మారా యి. వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గౌతాపూర్‌ సమీపంలోని మోత్కుల వాడుక, అల్లాపూర్‌ గ్రామసమీపంలో జినుగుర్తి-ఐనెల్లి గ్రామాల మధ్య పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించి గుంతలుపూడ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రెండు రోజుల్లో గుంతలు పూడ్చక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Follow Us on: