పాడేరులో ఉరుములతో కూడిన భారీ వర్షం

ABN , First Publish Date - 2021-04-19T05:20:13+05:30 IST

మన్యంలో ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది.

పాడేరులో ఉరుములతో కూడిన భారీ వర్షం
పాడేరులో వర్షం కురుస్తున్న దృశ్యం

పాడేరు, ఏప్రిల్‌ 18: మన్యంలో ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం మొ దలైంది. అక్కడక్కడ పిడుగులు  పడ్డాయి. ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్ముకోవడంతో చీకటి వాతావర ణం నెలకొంది. తాజా వర్షానికి రోడ్లన్నీ జలమయం కా గా, జనజీవనం స్తంభించింది. వేసవి దుక్కులకు  ఈ వర్షాలు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

జి.మాడుగుల: మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది.  మత్స్యగెడ్డలోకి వరదనీరు చేరింది. ఇటీవల తరచూ  వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు.

  మాడుగుల రూరల్‌: మండలంలో ఆదివారం మధ్యాహ్నం తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచీ ఎండతీవ్రత కొనసాగింది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వాతావరణం చల్లబడి జల్లులు పడ్డాయి.  దీంతో ఉక్కపోత ఎదురయింది. 

 పెదబయలు: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. అప్పటివరకు ఎండ తాపంతో అల్లాడిన జనం ఈ జల్లులతో సేదతీరారు.

Updated Date - 2021-04-19T05:20:13+05:30 IST