
కోల్‌కతా(పశ్చిమబెంగాల్): తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ హెచ్చరించింది. తుపాన్ ప్రభావం వల్ల కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.వాతావరణశాఖ అధికారుల హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని కోల్‌కతా పోలీసులు యూనిఫైడ్ కమాండ్ సెంటర్ అనే కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.
కోల్‌కతా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, డివిజన్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.తుపాను కారణంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు పరికరాలతో సిద్ధంగా ఉండాలని కోరారు.