Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం...పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

ABN , First Publish Date - 2022-08-16T13:15:49+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి 4 రోజుల పాటు భారీ నుంచి...

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం...పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు(Heavy rainfall) కురిసే అవకాశం ఉందని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ)(India Meteorological Department) మంగళవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఈ నెల 19వతేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని(fresh low pressure) వాతావరణశాఖ అధికారులు చెప్పారు.  ఒడిశా(Odisha) రాష్ట్రంలోని నబారంగాపూర్, నౌపద, బాలన్ గిర్, బర్గార్హ్, ఝార్సుగూడ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారులు మంగళవారం ఎల్లో అలర్ట్(yellow warning) జారీ చేశారు.


ఎల్లో అలర్ట్ జారీ 

ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఒడిశాలోని 5 సముద్రతీర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ, అతి భారీవర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఆగస్టు 17వతేదీన ఒడిశా కోస్తా జిల్లాలైన కియోంజర్, మయూర్ భంజ్ దేన్ కనాల్, అంగూల్, కంథామల్. బౌధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 17వతేదీన పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఈ నెల 18,19తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దు...

అల్పపీడనం ప్రభావం వల్ల ఉత్తర చత్తీస్ ఘడ్ ప్రాంతంలోనూ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఒడిశా తీరాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో రాగల 24 గంట్లలో అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు వివరించారు.అల్పపీనడనం ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో 18 వతేదీ నుంచి 19 వతేదీ వరకు అతి భారీ వర్సాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు కోరారు.


ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న నదులు

భారీవర్షాలు కురుస్తుండటంతో జునాఘడ్ బ్లాకులోని హాతి నది వరదనీటితో పొంగి ప్రవహిస్తోంది. భారీవర్షాలు, వరదల నేపథ్యంలో ఒడిశా చీఫ్ సెక్రటరీ సురేష్ మహాపాత్ర మంగళవారం అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.హీరాకుండ్ డ్యామ్ స్లూయిస్ గేట్లు మూసివేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. మహానది కూడా వరదనీటితో పొంగిప్రవహిస్తోంది. మహానది వరదనీటితో మా భట్టారికా దేవాలయం మునిగిపోవడంతో అధికారులు 144 సెక్షన్(Section 144 was imposed) విధించారు.మహానది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. ఒడిశా రాష్ట్రంలో 43 ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. 


Updated Date - 2022-08-16T13:15:49+05:30 IST