పదిరోజుల నుంచి వానలే వానలు

ABN , First Publish Date - 2021-11-24T18:23:35+05:30 IST

పదిరోజుల నుంచి నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు, మురికి వాడలు జలమయమయ్యాయి. దీంతో అధిక ప్రమాణంలో లోతట్లు ప్రాంతాల ఇళ్లలోకి వర్షపునీరు చొరబడడంతో

పదిరోజుల నుంచి వానలే వానలు

బళ్లారి(కర్ణాటక): పదిరోజుల నుంచి నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు, మురికి వాడలు జలమయమయ్యాయి. దీంతో అధిక ప్రమాణంలో లోతట్లు ప్రాంతాల ఇళ్లలోకి వర్షపునీరు చొరబడడంతో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, వస్తువులు నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. రోజూ ఒకవైపు నీటిని బయటకు తోడి వేస్తుండగా... మరోవైపు సీపేజి నీరు ఇళ్లలోకి వస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ ఇబ్బందులు కేవలం మురికి వాడలు, లోతట్లు ప్రాంతాలకే పరిమితం కాకుండా నగరంలో పలు అపార్ట్‌మెంట్లలోని సెల్లార్‌లో నాలుగడుగుల వర్షపు నీరు చేరడంతో మోటార్లు సహాయంతో నీటిని తోడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్‌ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపింగ్‌ చేయడానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-24T18:23:35+05:30 IST