బీ అలర్ట్.. మరో 24 గంటల్లో భారీ వర్షాలు..

ABN , First Publish Date - 2022-09-08T14:47:17+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో పల్లె నుంచి పట్నం వరకు ప్రజలు తడిసిముద్దమవుతున్నారు. భారీ వర్షాలతో చెరువులు

బీ అలర్ట్.. మరో 24 గంటల్లో భారీ వర్షాలు..

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో పల్లె నుంచి పట్నం వరకు ప్రజలు తడిసిముద్దమవుతున్నారు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాలకు(Heavy rains) ప్రాజెక్టులు నిండుకుండల మారుతున్నాయి. కాగా, గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. మంగళవారం, బుధవారం హైదరాబాద్‎లో భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా కురిసిన వర్షంతో రోడ్లపై వరద పోటెత్తింది. 

ఇక రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ(Department of Meteorology) ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంత ప్రభావంతో మరోమారు..నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయని తెలిపింది. దీంతో నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతుండటంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక..పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‎ను కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Updated Date - 2022-09-08T14:47:17+05:30 IST