అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Published: Fri, 03 Sep 2021 10:54:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

అనంతపురం: అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కదిరి పరిధిలోని తలుపుల మండలంలో భారీ కురిసింది. కుండపోత వర్షానికి పులివెందుల-కదిరి రహదారి దెబ్బతింది. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో పులివెందుల-కదిరి రోడ్డుమార్గంలో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయి. అంతేకాకుండా..తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు చెరువులకు గండిపడటంతో వరి పంట దెబ్బతింది. భారీ వర్షాలకు కదిరి-పులివెందుల ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కదిరి మాజీ కౌన్సిలర్ హుస్సేన్ కొడుకు, మరో వ్యక్తి వరదలో గల్లంతయ్యారు. మరోచోట కదిరి-రాయచోటి రహదారిపై వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. గల్లంతైన వారి కోసం గజఈతగాళ్లతో గాలిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.