Mahabubabadలో భారీ వర్షాలు... మత్తిడి పోస్తున్నచెరువులు

ABN , First Publish Date - 2022-07-09T18:25:27+05:30 IST

జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు మత్తడి పోస్తున్నాయి.

Mahabubabadలో భారీ వర్షాలు... మత్తిడి పోస్తున్నచెరువులు

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. వర్షాల కారణంగా బయ్యారం పెద్ద చెరువు తులారం ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. బయ్యారం గుట్టమీద పాండవుల జలపాతం, చింతొని గుంపులోని వంక వాగు జలపాతాలు జాలువారుతున్నాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయ్యారం, తిమ్మాపురం గ్రామాల మధ్య వట్టేవాగు...  గార్ల, రాంపురం గ్రామాల మధ్య పాకాల ఏరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2022-07-09T18:25:27+05:30 IST