రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-08-09T18:32:16+05:30 IST

వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సాను, అనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు

విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సాను, అనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌పై ఇది కేంద్రీకృతమై అవకాశం కనిపిస్తుందని... తెలంగాణ జిల్లాలో రేపు, ఎల్లుండి  వర్షాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. గోదావరి వరద ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

Updated Date - 2022-08-09T18:32:16+05:30 IST