TS News: వికారాబాద్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం

ABN , First Publish Date - 2022-07-26T15:13:27+05:30 IST

జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వాగులు పొంగిన పోర్లుతున్నాయి.

TS News: వికారాబాద్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం

వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం(Heavy rains) కురుస్తోంది. వాగులు పొంగిన పోర్లుతున్నాయి. కోట్ పల్లి ప్రాజెక్టు(Kotpalli project) అలుగు పారుతుండడంతో ధారూర్, నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు  నిలిచి పోయాయి. దాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి నీరు పారుతుండటంతో తాండూరు - హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్‌లో వర్షంతో పారుతున్న నాగులను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్(Anand) పరిశీలించారు. ఫోన్‌లో ఆర్డీవోతో మాట్లాడి రెవిన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. 

Updated Date - 2022-07-26T15:13:27+05:30 IST