Heavy rains: ఉప్పొంగిన వాగులు వంకలు

ABN , First Publish Date - 2022-08-30T17:50:23+05:30 IST

గడిచిన మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కంప్లి పరిధిలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బలాపురం, ఎమ్మిగనూరు(Balapuram,

Heavy rains: ఉప్పొంగిన వాగులు వంకలు

కంప్లి(బెంగళూరు), ఆగస్టు 29 : గడిచిన మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కంప్లి పరిధిలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బలాపురం, ఎమ్మిగనూరు(Balapuram, Emmiganoor) వద్ద వున్న పెద్ద వాగు, దరోజీ వద్ద వున్న చెరువు, కురుగోడు, గెణకల్‌ వద్ద గల వాగులు రెండు రోజులుగా కురిసిన వర్షానికి పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అధిక వర్షం వల్ల పంటల నష్టంతో రైతన్నలు, రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాల్లో నీరు చేరుకుని రైతులు పూర్తిగా నష్టాలపాలయ్యారు. నష్టపరిహారం చెల్లించాలంటూ రైతన్నలు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-30T17:50:23+05:30 IST