Heavy rainsకు 105 మంది మృతి

ABN , First Publish Date - 2021-11-29T16:46:08+05:30 IST

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న సాధారణ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 105 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నివారణ శాఖామంత్రి కె.కె.ఎస్‌.ఎస్‌.ఆర్‌.

Heavy rainsకు 105 మంది మృతి

మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ వెల్లడి

చెన్నై/అడయార్: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న సాధారణ నుంచి అతి భారీ వర్షాల కారణంగా  ఇప్పటివరకు 105 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నివారణ శాఖామంత్రి కె.కె.ఎస్‌.ఎస్‌.ఆర్‌. రామచంద్రన్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు, నాగ పట్టణం, తంజా వూరు, పుదుక్కోట, రామనాథపురం, తూత్తు క్కుడి, పెరంబలూరు, అరియ లూరు, రాణిపేట, తిరుచ్చి, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లో 108 పునరా వాస కేంద్రాల్లో 15,016 మంది వరద బాధితులకు పునరా వాసం కల్పించినట్టు చెప్పారు. చెన్నై నగరంలో ఏడు కేంద్రా ల్లో 1048 మంది తలదాచుకుంటున్నారన్నారు. అలాగే, చెన్నై నగరంలో 86 చోట్ల వర్షపునీటిని తొలగించినట్టు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో భారీ మోటార్లను వర్షపు నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని మంత్రి రామచంద్రన్‌ వివరించారు.

Updated Date - 2021-11-29T16:46:08+05:30 IST