Welcome Cheetahs: విదేశీ చిరుతల కోసం కునో పార్కులో 7 హెలీప్యాడ్‌లు

ABN , First Publish Date - 2022-09-06T18:22:09+05:30 IST

దేశాల నుంచి చిరుత పులులను రప్పించేందుకు(Welcome Cheetahs From Abroad) మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కులో(Kuno Park) 7 హెలీప్యాడ్‌లు...

Welcome Cheetahs: విదేశీ చిరుతల కోసం కునో పార్కులో 7 హెలీప్యాడ్‌లు

భోపాల్ (మధ్యప్రదేశ్): విదేశాల నుంచి చిరుత పులులను రప్పించేందుకు(Welcome Cheetahs From Abroad) మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కులో(Kuno Park) 7 హెలీప్యాడ్‌లు(Helipads) నిర్మించాలని నిర్ణయించారు. దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుతలను తెప్పించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉందన్న సూచనల మధ్య అధికారులు హెలిప్యాడ్‌లను నిర్మిస్తున్నారు.దక్షిణాఫ్రికా (South Africa)నుంచి ఒక బృందం మంగళవారం కునో పార్కుకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.చిరుతల(Cheetahs) ట్రాన్స్‌లోకేషన్ ప్లాన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్, సీనియర్ ప్రొఫెసర్ యద్వేంద్రదేవ్ విక్రమ్‌సిన్హ్ ఝాలా కూడా మంగళవారం కునోపార్కుకి చేరుకోనున్నారు.


కునో పార్కు లోపల 3, బయట 4 హెలీప్యాడ్ లను నిర్మించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన జన్మదినం (birthday) సెప్టెంబర్ 17న కునోపార్కుకు వస్తున్నట్లు ఎంపి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణులు) జెఎస్ చౌహాన్ చెప్పారు.దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను ఎగుమతి చేసేందుకు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. చిరుతలను అడవిలోకి వదిలే ముందు రెండు మూడు నెలల పాటు ఎన్‌క్లోజర్‌లో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.



Updated Date - 2022-09-06T18:22:09+05:30 IST