గతుకుల రోడ్డుతో నరకయాతన

Sep 22 2021 @ 00:30AM
ప్రమాదాలకు నిలయంగా మరిన ఆర్‌ఎ్‌స.పేట రోడు

ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు

పామూరు, సెప్టెంబరు 21: మండలంలోని కంభాలదిన్నె పంచాయతీ పరిధిలోని  రజాసాహెబ్‌పేట గ్రామానికి వెళ్లే రోడ్డు గతుకులమయంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీసీరోడ్డు నిర్మించేందుకు గ్రావెల్‌తో రోడ్డు నిర్మించారు. అయితే ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వంలో సీసీరోడ్డు నిర్మిస్తామని రోడ్డుకు ఇరువైపులా గోతులు తీశారు. పనులు చేపట్టకుండా వదిలేయడంతో పలు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవలే ఫెన్సింగ్‌ రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఈ రోడ్డులో అదుపుతప్పి ఒకపక్కకు ఒరిగింది. దీంతో ఫెన్సింగ్‌ రాళ్లపై ఉన్న ఇద్దరిపై రాళ్లుపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అంతేకాక ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు వచ్చిన సమయంలో రోడ్డు పక్కన గోతులు తీసి ఉండడం వలన వాహానాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైన సంబంధిత శాఖాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రమాదాలు  జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.