సభకు నమస్కారం

ABN , First Publish Date - 2020-09-23T07:08:47+05:30 IST

రాజ్యసభలో వరుసగా మూడో రోజూ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష

సభకు నమస్కారం

లోక్‌సభ, రాజ్యసభ బాయ్‌కాట్‌..

ప్రతిపక్షాల మూకుమ్మడి నిర్ణయం

కాంగ్రెస్‌ నేతృత్వంలో బయటకు

వ్యవసాయ బిల్లులకు నిరసనగా

ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు

ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేత కూడా

మోదీ సర్కారు ప్రధాన లక్ష్యం 

‘ఒకే దేశం-ఒకే మార్కెట్‌’: ఆజాద్‌

సస్పెండైన ఎంపీల ధర్నా విరమణ

మూడున్నర గంటల్లో 7 బిల్లులు పాస్‌

విపక్షాలు లేకపోవడంతో మమ..!

పన్ను చెల్లింపుదారులకు 

ఊరటనిచ్చే బిల్లుకూ గ్రీన్‌సిగ్నల్‌

మరో సాగు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అత్యవసర సరుకుల జాబితా నుంచి

ఉల్లి, దుంపలు మినహాయింపు

నేటితో ముగియనున్న సమావేశాలు


విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి! వ్యవసాయ బిల్లులకు నిరసనగా పార్లమెంటును మూకుమ్మడిగా బహిష్కరించాయి! ఇందుకు కాంగ్రెస్‌ నేతృత్వం వహించగా.. దానిని టీఆర్‌ఎస్‌, లెఫ్ట్‌, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, ఆర్జేడీ, డీఎంకే తదితర పార్టీలు అనుసరించాయి. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలని కోరడంతోపాటు 3 డిమాండ్లనూ సర్కారు ముందుంచాయి.


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో వరుసగా మూడో రోజూ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులంతా సభాధ్యక్షుడిని కలిశారు. ఎనిమిదిమంది సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరారు. అనంతరం ఆప్‌, తృణమూల్‌ సభ్యులతో కలిసి విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ పెద్దల సభ నుంచి బయటకు వచ్చారు. అంతకు ముందు సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ఉంచారు.


వాటిలో ఒకటి కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానాన్ని బలహీనం చేయరాదనేది. ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయకుండా నిలువరిస్తూ బిల్లు తేవాలని కోరారు. రెండోది స్వామినాథన్‌ కమిటీ సిఫారసు ఆధారంగానే ఎమ్మెస్పీని ఖరారు చే యాలని డిమాండ్‌ చేశారు. మూడోది నిర్దిష్ట ఎమ్మెస్పీకి ప్రభు త్వం కానీ ఎఫ్‌సీఐ కానీ పంటలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్‌ను ఎత్తి వేయడంతోపాటు 3 డిమాండ్లను ఆమోదించే వరకూ పార్లమెంటు బాయ్‌కాట్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


సభలో ప్రతిపక్ష గళాన్ని పట్టించుకోలేదని, సభ్యుల హక్కులను గుర్తించలేదని పదే పదే చెప్పినా బిల్లులను సెలెక్ట్‌ లేదా స్టాండింగ్‌ కమిటీకి పంపలేదని తప్పుబ ట్టారు. ప్రభుత్వం ‘ఒకే దేశం-ఒకే మార్కెట్‌’ ఉండాలని కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. ‘‘ప్రభుత్వం తొలుత ‘ఒకే దేశం- ఒకే పన్ను’ అన్నది. తర్వాత ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు అన్న ది. దేవుడి దయ వల్ల ‘ఒకే దేశం-ఒకే పార్టీ’ అనడం లేదు’’ అన్నారు.


కొంతసేపటి తర్వాత కాంగ్రెస్‌, టీఎంసీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్‌ సహా లోక్‌సభలోని విపక్షాలు కూడా వాకౌట్‌ చేశాయి. సస్పెండైన 8 మంది సభ్యులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలన్నీ లోక్‌సభనూ బాయ్‌కాట్‌ చేశాయని విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. పార్లమెంటును బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయంతో సోమవారం రాత్రి నుంచి కొనసాగిస్తున్న నిరవధిక ధర్నాను 8 మంది ఎంపీలు విరమించారు. 


ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తి వేయాలి: కేకే

8 మంది ఎంపీల సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని టీఆర్‌ఎ్‌సపీపీ నేత కె.కేశవరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సభాకార్యక్రమాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటనలను ఖండించారు. 252సీ నిబంధన ప్రకారం డివిజన్‌ కోసం 3 నిమిషాల గడువు ఇవ్వాల్సి ఉన్నా.. డిప్యూటీ చైర్మన్‌ ఓటింగ్‌కు అనుమతి ఇవ్వకుండానే మూజువాణి ఓటు తో ఏకపక్షంగా వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేయడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.


ఏకపక్షంగా ఆమోదించుకున్న వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు. వ్యవసా య బిల్లులను వెనక్కి తీసుకోవాలని, సస్పెన్షన్లకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా రాజ్యసభ సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు కేకే ప్రకటించారు.




మరో సాగు బిల్లుకు పెద్దల సభ ఆమోదం

ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పదమైన వ్యవసాయరంగ బిల్లు ల్లో మరొక బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అత్యవసర సరుకుల జాబితా నుంచి పప్పుధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనెగింజలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను మినహాయించారు. 1955 నాటి చట్టం స్థానే తెచ్చిన ఈ బిల్లు ద్వారా నిల్వపై ఉన్న పరిమితులను ఎత్తేశారు.


యుద్ధం, ప్రకృతి విపత్తులు, కరువు, విపరీతంగా ధరల పెరుగుదల.. మొదలైన అసాధారణ పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో సరుకు నిల్వపై ఆంక్షలుండవు. ఇకపై ఉత్పత్తి, నిల్వ, రవాణా, సరఫరా, పంపిణీలపై స్వేచ్ఛ ఉంటుం ది. ప్రైవేటు పెట్టుబడులకు మరింత వీలు ఏర్పడుతుందని, మార్కెట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గుతుందని బిల్లును ప్రవేశపెట్టిన వినియోగదారుల వ్యవహారాల సహాయమంత్రి దన్వే రావుసాహెబ్‌ దాడారావ్‌ చెప్పారు. రైతులు, వినియోగదారులిద్దరికీ ఈ బిల్లు ద్వారా లాభం చేకూరుతుందని, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన తెలిపారు.


సాగు బిల్లుల్లో రెండింటిని.. వ్యవసాయ మార్కెట్‌ బిల్లు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ బిల్లులను విపక్షాల నిరసన, ఆగ్రహావేశాల మధ్య కేంద్రం మూడ్రోజుల కిందట రాజ్యసభలో ఆమోదింపజేసుకుం ది. తాజా బిల్లు సమయంలోనూ సభలో విపక్షాలేవీ లేవు. బీజేపీ, దాని మిత్రపక్షాలు అన్నాడీఎంకే, వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌, బీజేడీ, జేడీయూ సభ్యులు, టీడీపీ సభ్యులు మాత్రమే సభలో ఉండి బిల్లులకు మద్దతు పలికారు.




క్షమాపణ చెబితేనే..

ఎంపీలు సభలో తమ ప్రవర్తనకు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్‌ ఎత్తివేత గురించి ఆలోచిస్తామని కేం ద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో తవార్‌ చంద్‌ గెహ్లోత్‌ కూడా ఇదే చెప్పారు.

Updated Date - 2020-09-23T07:08:47+05:30 IST