‘హెల్మెట్‌ తప్పనిసరి’

ABN , First Publish Date - 2022-01-22T05:07:27+05:30 IST

ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌పటేల్‌ కోరారు.

‘హెల్మెట్‌ తప్పనిసరి’

మారేడుమిల్లి, జనవరి 21: ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌పటేల్‌ కోరారు. శుక్రవారం ఆయన మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ సందర్శించి హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. అన్నపూర్ణ కనస్ట్రక్షన్స్‌ సమకూర్చిన 30 హెల్మెట్లను సిబ్బందికి అందజేశారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. సీఐ అద్దంకి శ్రీనివాసరావు, మారేడుమిల్లి ఎస్‌ఐ ఎస్‌.రాము, గుర్తేడు ఎస్‌ఐ జ్వాలసాగర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:07:27+05:30 IST