Advertisement

నా బిడ్డకు కావలసింది వెంటిలేటర్ కాదు! మీ సాయమే..

Oct 14 2020 @ 14:33PM

నా పేరు పూజ. ఏ తల్లికైనా తన జీవితంలో అత్యంత మధురమైన క్షణం అమ్మా అని పిలిపించుకోవడమే. దేవుడి దయతో నా పెళ్ళయిన నాలుగేళ్ళకు అమ్మనయ్యాను. కానీ, వరంతో పాటు శాపం కూడా వెనువెంటనే వచ్చింది. ఆ రోజును తల్చుకుంటే వెన్నులో వణుకు పుడుతోంది. నా జీవితం తల్లకిందులై సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాను.


నేను గర్భం దాల్చి ఏడో నెలలోకి ప్రవేశించాను. అప్పటివరకూ అంతా బాగానే ఉంది. నా భర్త ప్రతి నెలా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తూ నేను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేవాడు. దురదృష్టవశాత్తూ ఒకసారి చెకప్ కోసం వెళ్ళినప్పుడు ఒక అనుకోని సమస్యను డాక్టర్ గుర్తించారు. నాకు చేసిన టెస్ట్ రిజల్ట్స్ చూపించి... "పూజా, నీ ఒంట్లో స్వల్పంగా రక్తస్రావం జరుగుతున్నట్టు గమనించాను. ఇదేమంత భయపడాల్సిన విషయం కాదు గానీ, నీ ఆరోగ్యం సరిగ్గా ఉండేలా చూడటానికి మూడు రోజుల పాటు నిన్ను ఆస్పత్రిలో చేర్చుకుంటాను" అన్నారు.


రక్తస్రావం ఎందుకవుతోందో నాకేమీ అర్థం కాలేదు కానీ, ఆస్పత్రిలో చేరి డాక్టర్ చెప్పిన ప్రకారం మెడిసిన్స్, యాంటీ బయాటిక్స్ వాడాను. నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా భర్త రోజూ వస్తుండేవాడు. మా చిన్నారి ఎప్పుడెప్పుడు బయటకొచ్చి ఆనందాన్ని పంచుతుందో కదా... అని నాలాగే ఆలోచిస్తూ ఆతృతగా సంతోషంగా ఉండేవాడు. 


కొన్ని రోజుల పాటు అంతా బాగానే గడిచింది. ఒక రోజున ఉన్నట్టుండి నా ఆరోగ్యం బాగా దిగజారింది. నేనప్పటికి 7 నెలల గర్భవతిని. నొప్పులతో ప్రసవవేదన తీవ్రమై కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా బాధ కలిగింది. కొన్ని గంటలు గడిచాక పరిస్థితి భయానకంగా మారిపోయింది. నా కడుపులోంచి ఉమ్మనీరంతా బయటకు వచ్చేసింది. ఏం జరుగుతోందో నేను అర్థం చేసుకోలేనంత వేగంగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతా అర్థమయ్యేలోపే నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్ళారు. డాక్టర్లు, నర్సులు చుట్టుముట్టారు.


డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి

 


"పూజా... నువ్వు శ్వాస తీసుకోవాలి. అంతా బాగావుతుంది. ప్రస్తుతం నీ బేబీ పరిస్థితి కష్టంగా ఉంది. నీకు వెంటనే C సెక్షన్ చెయ్యాలి. సరేనా?" అంటూ డాక్టర్ నా ఊపిరి సమంగా ఉండేలా ప్రయత్నిస్తూనే అడిగారు. నాకు బాధతో కన్నీరు ఉబికి వచ్చేస్తోంది. పిచ్చిగా తలూపుతూ ఏం చేసైనా సరే నా బిడ్డను కాపాడమని అర్ధించాను. అక్కడున్న అద్దాల నుంచి నా భర్త కనిపించాడు. అసహనంగా తిరుగుతూ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఆయన్ని చూస్తూ మౌనంగానే దేవుణ్ణి వేడుకున్నాను... అంతా బాగుంటుందనే ఆశతో ఉన్నాను.


చివరికి నా పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ శబ్దం ఇంతకు ముందెప్పుడూ లేనంత మధురంగా అనిపించింది. అమ్మనయ్యానన్న ఆలోచనతో ఆనందబాష్పాలు బయటకొచ్చాయి.


"కంగ్రాట్స్ పూజా... నీకు అమ్మాయి పుట్టింది. నెలలు నిండక ముందే పుట్టడం వల్ల పాపకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. బిడ్డను ప్రస్తుతం NICUలోకి తీసుకెళ్ళి ఇంక్యుబేటర్‌లో ఉంచాము" అని డాక్టర్ చెప్పారు. ఆ మాటల్లో బాధ, ఆందోళన కనిపించాయి.

డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి

డాక్టర్ నోట వచ్చిన ఆ పలుకులు నన్ను ముళ్ళలా గుచ్చుకున్నాయి. నాలోని అణువణువూ స్తంభించిపోయింది.... ఇక భవిష్యత్తనేది లేదన్నట్టుగా ఏడ్చాను. నా ఒంటి మీద కుట్లు ఇంకా ఆరకపోయినా అలాగే కష్టపడి మంచం మీది నుంచి లేచాను. నా బిడ్డను చూసుకోవడానికి NICU వైపు నడిచాను.


నెలలు నిండకుండా పుట్టిన నా బిడ్డకు పూర్తిస్థాయిలో మంచి చికిత్స జరిగి ఆరోగ్యంగా బయటకు రావాలంటే మీ సాయం కావాలి. పెద్ద మనసు చేసుకుని చేయూతనివ్వండి.


డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.