ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-04-18T04:58:16+05:30 IST

పట్టణంలోని తారకరామ నగర్‌లో నివాసం ఉంటున్న నిరుపేదరాలు దివ్యాంగురాలు లక్ష్మీదేవికి చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు.

ఆర్థిక సాయం

డోన్‌(రూరల్‌), ఏప్రిల్‌ 17: పట్టణంలోని తారకరామ నగర్‌లో నివాసం ఉంటున్న నిరుపేదరాలు దివ్యాంగురాలు లక్ష్మీదేవికి చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు. పట్టణంలోని ప్రజావైద్యశాల మల్లికార్జున, 27వ వార్డు కౌన్సిలర్‌ వెంకట్రాముడు చేతుల మీదుగా ఈ సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రామనాయుడు, అధ్యక్షుడు భాస్కర్‌, సభ్యులు మీసేవ శ్రీను, రవికుమార్‌, హరి తదితరులు పాల్గొన్నారు.


కౌతాళం: వల్లూరు గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన హరిజన దేవమ్మ కుటుంబాన్ని టీడీపీ నాయకుడు సింగల్‌ విండో మాజీ అఽధ్యక్షుడు అడివప్పగౌడ్‌ పరామర్శించారు. రూ.4వేలు అందజేశారు.


Updated Date - 2021-04-18T04:58:16+05:30 IST